Saturday, May 4, 2024
- Advertisment -
HomeLatest NewsKanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

Kanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

Kanti Velugu | తెలంగాణలో ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( KCR ) ఈ నెల 18న మధ్యాహ్నం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ( Harish Rao ) తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఖమ్మంలో సీఎం ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.

వివిధ ప్రాంతాల్లో ప్రారంభం అయ్యే కంటి వెలుగు కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనేలా ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు కంటి పరీక్షలు నిర్వహించే మిషన్లు, కళ్లద్దాలు, మందుల పంపిణీ చేయాలన్నారు.

వీటిలో దేనిలో ఇబ్బందులు ఎదురైనా సరే వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతికి ఫిర్యాదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో గ్రూపులుగా ఏర్పడి వాటి ద్వారా సమన్వయం అయ్యేట్లు చూసుకోవాలన్నారు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాటిలో పరిస్థితులను వివరించాల్సి ఉంటుందన్నారు.

ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల సమయంలో సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కంటి పరీక్షల కోసం ఆధార్‌ తప్పనిసరి అని ముందస్తుగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడత కంటి వెలుగు ( Kanti Velugu ) కార్యక్రమం 8 నెలలు జరిగితే, ఈ సారి వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించారు. గతంలో 827 బృందాలు పని చేస్తే, ఈ విడత 1500 లకు పెంచుకున్నట్లు హరీశ్ రావు చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News