Friday, April 26, 2024
- Advertisment -
HomeUncategorizedElon Musk | ఆ ఉద్యోగికి క్షమాపణలు చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకలా ?

Elon Musk | ఆ ఉద్యోగికి క్షమాపణలు చెప్పిన ఎలాన్‌ మస్క్‌.. ఎందుకలా ?

Elon Musk | పంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చెప్పాపెట్టకుండా ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగిస్తూ వారికి పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు మస్క్‌. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి అంశంపై మాట్లాడేందుకు ముందుంటున్నారు.

ఇలా ట్విట్టర్ మాజీ ఉద్యోగి ఒకరితో మస్క్ చేసిన చాట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకోంకుండా మాట్లాడానని పేర్కొన్నారు ఎలాన్ మస్క్. అందుకు క్షమించాలని ఉద్యోగిని కోరారు. ఉద్యోగ కోతల్లో భాగంగా హరాల్దుర్ థోర్లిప్సన్ అనే వ్యక్తి జాబ్ కోల్పోయారు. ఆయన కండరాల బలహీనతతో బాధపడుతున్నారు.

తన సొంత పనులను చేసుకునేందుకు కూడా మరొకరి సాయం అవసరం. కచ్చితంగా వీల్ ఛైర్ కావల్సిందే. ఈ క్రమంలో తన ఆరోగ్య సమస్యల గురించి తెలిసి కూడా తనను ఉద్యోగం నుంచి తొలగించారని హరాల్దుర్ థోర్లిప్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను తొలగించిన తీరు సరికాదని, ఆఫర్ చేసిన పరిహార ప్యాకేజీ పైనా ట్విట్టర్‌లో రాసుకొస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

హరాల్దుర్ థోర్లిప్సన్ ట్వీట్‌కు స్పందించారు ఎలాన్ మస్క్. కంపెనీకి థోర్లీప్సన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చాలా కటువుగా మాట్లాడారు. ఇప్పటికే చాలా ఆస్తులు ఉన్నా భారీ పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అయితే మస్క్ వ్యాఖ్యలపై హరాల్దుర్ తిరిగి సమాధానమిచ్చారు. తాను శారీరక లోపం వల్ల కదల్లేకపోతున్నానని, కానీ, మస్క్ మాత్రం దృఢంగా ఉన్నా సెక్యూరిటీ సాయం లేకుండా వాష్‌రూంకి కూడా వెళ్లడం లేదని పేర్కొన్నాడు.

ఈ క్రమంలో థోర్లీప్సన్ పరిస్థితి తనకు తెలియదని మస్క్ రాసుకొచ్చారు. అతడి గురించి చెప్పిన వారు సరిగా వివరించలేదని, అందువల్లే తప్పు దొర్లిందని, అపార్థం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. హరాల్దుర్ థోర్లీప్సన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే.. రెండు రోజుల క్రితమే హరాల్దుర్ ట్విట్ చేశారు. తన వర్క్ కంప్యూటర్ యాక్సెస్ తొలగించారని, తొమ్మిది రోజులు అయినా తన ఉద్యోగం ఉందా? పోయిందా? అనే విషయంపై క్లారిటీ లేదని పేర్కొన్నారు. నేరుగా ఎలాన్ మస్క్‌నే ప్రశ్నించారు హారాల్దుర్ థోర్లిప్సన్. నా ఉద్యోగం ఉందో ఊడిందో చెప్పాలని, ట్విట్టర్ హెచ్‌ఆర్ హెడ్ నుంచి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో మస్క్, హరాల్దుర్ మధ్య చాట్ కొనసాగింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News