Home Latest News Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Unlock your mobile | స్మార్ట్ఫోన్ లాక్ చేయడానికి ఇప్పుడు రకరకాల ఫీచర్లు వచ్చాయి. స్మార్ట్ఫోన్లు వచ్చిన కొత్తలో పిన్ ఎంటర్ చేయడం ఒక్కటే ఆప్షన్గా ఉండేది. అదే ఇప్పుడు టచ్ ఐడీలు, ఫేస్ ఐడీలు వచ్చేశాయి. దీంతో చాలామట్టుకు వీటినే వాడుతున్నారు. అయితే ఎన్ని వచ్చినా సరే టచ్ ఐడీ, ఫేస్ ఐడీలు పనిచేయకపోతే చివరగా పిన్నే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి రెగ్యులర్గా యూజ్ చేయడం లేదు కదా అని ఆ పిన్ గుర్తులేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవైపు ఫేస్ ఐడీ, టచ్ ఐడీలు పనిచేయక.. మరోవైపు మొబైల్ అన్లాక్ పిన్ మరిచిపోతే అప్పుడు ఎలా? ఫోన్ అన్లాక్ చేయడమెలా? దీనికి ఓ సింపుల్ చిట్కా ఉంది.

  • ఆండ్రాయిడ్ మొబైల్లోని ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం ముందుగా వేరే మొబైల్ లేదా కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేయాలి. తర్వాత గూగుల్ ఫైండ్ మై డివైజ్ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  • లాక్ అయిన మొబైల్లో ఏ జీమెయిల్ అయితే ఉందో.. అదే ఐడీతో గూగుల్ ఫైండ్ మై డివైజ్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
  • అప్పుడు ఆ జీమెయిల్తో లాగిన్ అయి ఉన్న మొబైల్స్, ఇతర డివైజ్ల జాబితా కనిపిస్తుంది.
  • అందులో అన్లాక్ పిన్ మరిచిపోయిన మొబైల్ నేమ్ మీద క్లిక్ చేసి.. లాక్ ఆప్షన్ను ఎంచుకోవాలి.
  • టెంపరరీ పాస్ కోడ్ ఎంటర్ చేసి లాక్ బటన్ నొక్కాలి.
  • అప్పుడు రింగ్, లాక్, ఎరేజ్ అనే మూడు ఆప్షన్లు స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాటిలో లాక్ ఆప్షన్ ఎంచుకోవాలి. దాని కింద ఉన్న సెర్చ్ బాక్స్లో టెంపరరీ పాస్ కోడ్ ఎంటర్ చేయాలి.
  • అనంతరం లాక్ అయిన ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ టెంపరరీ పాస్ కోడ్ ఎంటర్ చేస్తే.. ఫోన్ అన్లాక్ అవుతుంది.
  • మొబైల్ అన్లాక్ చేయాలంటే ఇవి తప్పనిసరి
  • ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్న సమయంలో అన్లాక్ పిన్ మరిచిపోయిన మొబైల్కు ఇంటర్నెట్ ఆన్లో ఉండటం తప్పనిసరి. అలాగే గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఆప్షన్తో మొబైల్ ఎనేబుల్ అయి ఉండాలి. ఒకవేళ వీటిలో ఏది లేకపోయినా ఫోన్ అన్లాక్ చేయడం కుదరదు. అలాంటప్పుడు ప్లే స్టోర్లో దొరికే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా అన్లాక్ చేయాల్సి ఉంటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Exit mobile version