Home News International Bard | మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటికి పోటీగా గూగుల్ బార్డ్.. కీలక ప్రకటన చేసిన సుందర్ పిచాయ్

Bard | మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటికి పోటీగా గూగుల్ బార్డ్.. కీలక ప్రకటన చేసిన సుందర్ పిచాయ్

Bard | మైక్రోసాఫ్ట్‌ అండతో ఎదుగుతున్న చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ రంగంలోకి దిగింది. ఏఐ ఆధారిత చాట్ బాట్ బార్డ్ ( Bard )ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలుపెట్టినట్లు పేర్కొంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.

ముందుగా యూజర్ల ఫీడ్ బ్యాక్ కోసం బార్డ్‌ను విడుదల చేస్తున్నామని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ బ్లాగ్‌లో వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏఐ‌ ‌వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్‌లో గూగుల్ దాదాపు రూ.3,299 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు పిచాయ్ చెప్పారు. అయితే బార్డ్‌ను ప్రయోగాత్మకంగా రెండేళ్ల క్రితమే గూగుల్ ఆవిష్కరించింది. కాగా, క్లిష్టమైన అంతరిక్ష ఆవిష్కరణలను చిన్న పిల్లలకు సైతం బార్డ్ సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందని గూగుల్ పేర్కొంది.

చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సంస్థ రూపొందించింది. ఇందులో మైక్రోసాఫ్ట్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన గూగుల్.. బార్డ్ పేరుతో ప్రకటన విడుదల చేసింది. అట్లాస్ పేరుతో బార్డ్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. బార్డ్ కూడా యూజర్లు అడిగిన ప్రశ్నలకు నాణ్యతతో కూడిన సమాచారం అందించనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

Exit mobile version