Home Latest News BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

High Court of Telangana

BRS MLAs Poaching Case | తెలంగాణలోని మునుగోడు ఎన్నికల సమయంలో దేశం మొత్తం తన వైపు చూసేటట్లు చేసిన విషయం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. దీని గురించి రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్‌ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్థించిన డివిజన్‌ బెంచ్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసులో అనేక ట్విస్ట్‌ లు చోటు చేసుకున్నాయి. దాంతో ఈ కేసు పై ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. సీబీఐతో విచారణకు గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్‌ బెంచ్‌ ను ఆశ్రయించింది.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… సీబీఐ విచారణకే మొగ్గు చూపింది. ఈ కేసులో జనవరి 18 న చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు వెళ్లేందుకు అడ్వకేట్‌ జనరల్‌ కొంత సమయం అడిగారు. అప్పటి వరకు ఆర్డర్‌ సస్పెండ్‌లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్‌ సస్పెన్షన్‌ కు హైకోర్టు నిరాకరించింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌ కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌ రెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఙప్తి చేయడంతో.. విచారణ ఫిబ్రవరి 20 కి వాయిదా వేసింది.

మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతిచ్చింది .

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Revanth Reddy | ఉద్యోగాలు రావాలంటే మార్పు రావాల్సిందే.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

Turkey Earthquake | ఒకవైపు వరుస భూకంపాలు.. మరోవైపు సునామీ.. తుర్కియే, సిరియాలపై ప్రకృతి విలయతాండవం.. మృతుల సంఖ్య 10వేలకు చేరే ఛాన్స్‌

Ponguleti Srinivas reddy | దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయండి.. బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి పొంగులేటి సవాల్‌!

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం.. భూకంప ధాటికి 640 మందికి పైగా సజీవ సమాధి

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Exit mobile version