Home Latest News Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Instagram | స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవాళ్లలో దాదాపు అందరూ ఏదో ఒక సోషల్‌మీడియా యాప్‌ను వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే రోజంతా ఆన్‌లైన్‌లోనే గడిపేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ రకరకాల సోషల్‌మీడియా యాప్స్‌లో బిజీబిజీగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను షేర్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే.. వాళ్లు చేసిన పోస్టుల కింద వచ్చే కొంతమంది అసభ్యకరమైన కామెంట్లు పెడుతుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందికి గురికావాల్సి వస్తుంది. దీంతో ఎలాంటి కామెంట్లు వస్తున్నాయా అని 24 గంటలూ చెక్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్యను గుర్తించిన ఇన్‌స్టాగ్రామ్‌ ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అనుచిత, అసభ్యకరమైన కామెంట్లు, మెసేజుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించేందుకు హిడెన్‌ వర్డ్స్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌ చేసుకోవడం వల్ల మనకు వచ్చే అసభ్యకర మెసేజులను ఇన్‌స్టానే ఆటోమేటిగ్గా హైడ్‌ చేసేస్తుంది.

హిడెన్‌ వర్డ్స్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా ఆన్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • యాప్‌ కింది భాగంలో కుడి వైపు ఉండే ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయాలి
  • ప్రొఫైల్‌లోకి వెళ్లిన తర్వాత.. రైట్‌ సైడ్‌ టాప్‌లో ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేసి సెట్టింగ్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.
  • సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి.. హిడెన్‌ వర్డ్స్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • హిడెన్‌ వర్డ్స్‌ ఫీచర్‌ను ఆన్‌ చేయడం వల్ల మన పోస్టు కింద ఏవరైనా అసభ్యకరమైన లేదా అనుచిత కామెంట్స్‌ పెట్టినప్పుడు అవి ఎవరికీ కనిపించవు. కాకపోతే కామెంట్స్‌లో కౌంట్‌ అవుతాయి. ఇలా ఆన్‌ చేసిన హిడెన్‌ వర్డ్స్‌ ఫీచర్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు రీసెట్‌ చేసుకునే సదుపాయం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Google Meet | ఆడియోను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

Whatsapp Deleted Messages | వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను ఇలా చూడొచ్చు

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Exit mobile version