Home Latest News India-China troops clash | భారత్‌-చైనా సరిహద్దుల్లో గాల్వాన్‌ తరహా ఘటన.. 30 మంది సైనికులకు...

India-China troops clash | భారత్‌-చైనా సరిహద్దుల్లో గాల్వాన్‌ తరహా ఘటన.. 30 మంది సైనికులకు గాయాలు

India-China troops clash | భారత్-చైనా సరిహద్దులో మరోసారి గాల్వాన్‌ తరహా ఘటన రిపీట్‌ అయింది. భారత భూభాగంలోకి చైనా సైనికులు రావడంతో భారత సైన్యం ( Indian Army ) వారిని అడ్డుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 30 మంది సైనికులకు గాయాలైనట్లు సమాచారం. ఈనెల 9న ఘర్షణ జరిగినట్లు భారత సైన్యం కూడా ధృవీకరించింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ సెక్టార్‌ వద్ద ఈ ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖ ( LAC ) వద్ద ఈనెల 9న ఘర్షణ జరిగింది. ఇరు దేశాలకు చెందిన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ భారత సైనికులను అసోం రాజధాని గౌహతికి తరలించారు. గౌహతి ఆర్మీ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఎల్‌ఏసీ సమీపంలోకి చైనా సైనికులు రావడంతో ఘర్షణ జరిగింది. అయితే అక్కడ శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల సైనికాధికారులు ఫ్లాగ్‌ మీటింగ్‌ నిర్వహించారు. అనంతరం ఇరు దేశాలు తమ బలగాలను అక్కడి నుంచి వెనక్కి రప్పించినట్లు సమాచారం.

2006 సుంచి ఇక్కడ ఇరుదేశాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. దాదాపు 17వేల అడుగుల ఎత్తులో ఈ ఘర్షణ జరిగింది. దాదాపు 300 మంది చైనా సైనికులు ఉండగా.. భారత్‌ నుంచి దాదాపు అంతే సంఖ్యలో సైన్యం అక్కడ ఉంది. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలోకి చైనా సైనికులు దాదాపు 200 మంది వచ్చేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది.

గల్వాన్‌ లోయలో 2020 జూన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్‌-చైనా బలగాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాల్వాన్‌ ఘటన పునరావృతమైంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cyber Crime | 3 కోట్లకు కిడ్నీ అమ్మకానికి పెట్టి.. 16 లక్షలు పోగొట్టుకుంది..మోసపోయిన ఏపీ యువతి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది

Exit mobile version