Home Latest News Whatsapp | పొరపాటున వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేశారా? ఇలా రికవరీ చేసుకోండి

Whatsapp | పొరపాటున వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేశారా? ఇలా రికవరీ చేసుకోండి

Whatsapp | వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపించారు.. కానీ అందులో అనవసరపు సమాచారం ఉందనుకున్నా.. లేదంటే ఏదైనా పొరపాటుగా టైప్ చేసినా డిలీట్ చేసేందుకు వాట్సాప్ ఎప్పుడో సదుపాయం కల్పించింది. డిలీట్ ఫర్ మి, డిలిట్ ఫర్ ఎవ్రీ వన్ అని రెండు ఆప్షన్లతో డిలీట్ ఆప్షన్ తీసుకొచ్చింది. దీన్ని చాలామంది బాగానే యూజ్ చేసుకుంటున్నారు. అయితే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ బదులు డిలీట్ ఫర్ మి అని సెలెక్ట్ చేసుకుంటే పరిస్థితేంటి? అప్పుడు ఏం చేయాలి?

మనం పంపిన మెసేజ్ ఎదుటివాళ్లు చూడొద్దని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని క్లిక్ చేయబోయి.. కొన్నిసార్లు డిలీట్ ఫర్ మి అని పొరపాటున క్లిక్ చేస్తుంటాం.ఈ పరిస్థితి చాలామందే ఎదుర్కొనే ఉంటారు. అలా పొరపాటు చేసిన తర్వాత నాలుక కరుచుకున్న లాభమేమీ ఉండదు. ఎదుటివాళ్లకు మెసేజ్ వెళ్లిపోతుంది కానీ దాన్ని మనం ఏమీ చేయలేం. అది నార్మల్ మెసేజ్ అయితే ఫర్వాలేదు.. అదే ఒకరికి పంపాల్సిన పర్సనల్ మెసేజ్‌ను వేరే వాళ్లకు పంపిస్తేనే అసలు సమస్య. దీనివల్ల గొడవలు కూడా జరగొచ్చు. ఈ సమస్యను గమనించిన వాట్సాప్..యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది ఎలా పనిచేస్తుంది?

పొరపాటు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ బదులు డిలీట్ ఫర్ మి అని క్లిక్ చేసినప్పుడు యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ద్వారా తిరిగి తీసుకురావచ్చు. దీనికోసం ప్రత్యేకించి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత కింద అండూ (UNDO) అని ఆప్షన్ క్లిక్ చేసి మెసేజ్‌ను రిట్రైవ్ చేయొచ్చు. అయితే దీనికి కేవలం 5 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఈలోపే మనం మెసేజ్‌ను అండూ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంది.

మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు

ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్ అందిస్తున్న వాట్సాప్.. గత నెలలో మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింవది. దీని ద్వారా ఏవైనా ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ ప్రతినిధులు అప్పట్లో తెలిపారు. మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ద్వారా నోట్స్, రిమైండర్స్, అప్‌డేట్స్, ఫైల్స్ చేసుకోవచ్చు.అలాగే నోట్ ప్యాడ్‌లా కూడా వినియోగించవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Most Dangerous web browser | మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? ఈ ఏడాదిలో అత్యంత ప్రమాదకరమైన బ్రౌజర్ ఇదేనంట !

Whatsapp | వాట్సాప్లో పాత మెసేజ్లను ఇక ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు

Hero Vishal on YS Jagan | రాజకీయాల్లో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విశాల్‌.. ఓటేసే అవకాశమొస్తే జగన్‌కే అంటూ షాకింగ్‌ కామెంట్స్‌

nline Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

Exit mobile version