Home Latest News Online Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.....

Online Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

Online Game | స్మార్ట్‌ ఫోన్‌ ఉంది కదాఅని ఇంటర్నెట్‌లో కనిపించే ఏ గేమ్‌ పడితే ఆ గేమ్‌ ఆడొద్దు. తెలియని లింకులపై కూడా క్లిక్‌ చేయొద్దు. ఎందుకంటే.. సైబర్‌ నేరగాళ్లు ఎప్పుడూ మన దృష్టి మరల్చి అకౌంట్లో డబ్బులు మాయం చేద్దామన్న ఆలోచనలోనే ఉంటారు. ఒక్కసారి వాళ్ల ఉచ్చులో పడితే ఇక అంతే.. అకౌంట్‌లో రూపాయి లేకుండా మాయం చేసేస్తారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు కూడా అలాగే ఆన్‌లైన్‌ గేమ్‌ అడి రూ. 95 లక్షలు పోగొట్టుకున్నాడు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన డిగ్రీ చదివే యువకుడు హర్షవర్ధన్‌ రెడ్డి మొబైల్‌లో గేమింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. అందులో గేమ్‌ ఆడేందుకు డబ్బులు చెల్లించాల్సి రావడంతో అకౌంట్‌ను లింక్‌ చేశాడు. అలా ఆడుతూనే ఉన్నాడు. డబ్బులు పోతున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చివరికి ఖాతాలోని 95 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.

యువకుడి తండ్రి భూ నిర్వాసితుడు. తనకు ఉన్న పొలాన్ని పరిశ్రమ ఏర్పాటు కోసం విక్రయించగా రూ.1.05 కోట్లు వచ్చాయి. వాటితో మరో ప్రాంతంలో భూమి కొనుగోలు చేసేందుకు కొంత డబ్బు అడ్వాన్స్‌గా చెల్లించాడు. మిగతా సొమ్ము చిన్న కుమారుడు హర్షవర్దన్‌ రెడ్డి ఖాతాలో వేశాడు. దీంతో ఆ డబ్బుతో హర్షవర్ధన్‌ రెడ్డి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. దాదాపు 95 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఉన్న డబ్బంతా మొబైల్‌ గేమ్ ఆడుతూ పోగొట్టుకోవడంతో విద్యార్థి కుటుంబసభ్యులు లబోదిబోమంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎలాగైనా తమ డబ్బులు ఇప్పించాలని ప్రాధేయపడ్డారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్‌.. కవిత, మాగుంట పేర్లు ప్రస్తావించిన ఈడీ

KTR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Sircilla kidnap | సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్… మేమిద్దరం ప్రేమించుకున్నాం.. తల్లిదండ్రులతోనే మాకు ప్రాణహాని..

Digvijaya singh on TPPC | తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఫోకస్.. రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్‌

Exit mobile version