Home Latest News Most Dangerous web browser | మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? ఈ ఏడాదిలో అత్యంత...

Most Dangerous web browser | మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? ఈ ఏడాదిలో అత్యంత ప్రమాదకరమైన బ్రౌజర్ ఇదేనంట !

Most Dangerous web browser | మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? దీనికి సమాధానంగా చాలామంది చెప్పే సమాధానం గూగుల్ క్రోమ్. దాని తర్వాత ఎక్కువగా వినిపించే పేరు మోజిల్లా ఫైర్ఫాక్స్. మీరు కూడా ఈ రెండింటిలో ఏదో ఒక బ్రౌజర్నే వినియోగిస్తుంటారు కదా ! అయితే మీకో షాకింగ్ న్యూస్. అత్యంత అసురక్షితమైన, హానికరమైన బ్రౌజర్ల జాబితాలో ఈ రెండే టాప్ ప్లేస్లో ఉన్నాయి. అట్లాస్ వీపీఎన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఐపీ అడ్రస్ మార్చడం, మీ కనెక్షన్లను గుప్తీకరించడం ద్వారా ఆన్లైన్లో ప్రైవేటు బ్రౌజింగ్ను నిర్ధారించే ఈ అట్లాస్ వీపీఎన్.. జూన్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు ఇంటర్నెట్ బ్రౌజింగ్కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించేందుకు ఒక అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం 2022లో అత్యంత ప్రమాదకరమైన యాప్ గూగుల్ క్రోమ్ అని తెలిసింది. ఈ పది నెలల కాలంలో గూగుల్ బ్రౌజర్లో 303 లోపాలను అట్లాస్ వీపీఎన్ గుర్తించింది. ఇక లైఫ్టైమ్లో 3,159 సమస్యలను గుర్తించింది.

గూగుల్ క్రోమ్ తర్వాత 117 లోపాలతో మొజిల్లా ఫైర్ఫాక్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మైక్రోసాఫ్ట్కు చెందిన ఎడ్జ్ బ్రౌజర్ కూడా అంత సేఫ్ బ్రౌజర్ కాదని తెలిసింది. ఇది 103 లోపాలతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో లోపాలు 61 శాతం పెరగడం గమనార్హం. ఈ బ్రౌజర్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 806 లోపాలు గుర్తించారు.

యాపిల్ సఫారీనే బెటర్

యాపిల్ కంపెనీకి చెందిన సఫారీ బ్రౌజర్.. యూజర్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మార్క్ను చేరుకుంది. దీంతో ఈ మార్క్ అందుకున్న రెండో బ్రౌజర్గా సఫారీ నిలిచింది. 2022లో సఫారీ బ్రౌజర్లో చాలా తక్కువ సమస్యలు వచ్చాయి. అట్లాస్ వీపీఎన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సఫారీలో కేవలం 26 లోపాలు మాత్రమే కనిపించడం గమనార్హం.

Exit mobile version