Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsIND vs BAN | బంగ్లాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ ర్యాంకులో రెండో...

IND vs BAN | బంగ్లాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ ర్యాంకులో రెండో స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా

IND vs BAN | బంగ్లాదేశ్‌తో రసవత్తరంగా సాగిన పోరులో టీమిండియా విజయం సాధించింది. మీర్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC 2021-23 ) పాయింట్ల పట్టికలో 58.93 పర్సంటేజీతో రెండో స్థానానికి దూసుకొచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఆడేందుకు రెండోసారి అవకాశం దక్కించుకుంది.

ఇక 13 విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా 76.92 పర్సెంటేజీ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. 54.55 పర్సంటేజీ పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది.ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక (53.33), ఇంగ్లండ్ (46.97) ఉన్నాయి. బాక్సింగ్ డే టెస్ట్‌లో భాగంగా సోమవారం నుంచి టీమిండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే..

బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబడింది.నాలుగో రోజు 45/4 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన టీమిండియాకు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే మూడు వికెట్లు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్ అయ్యర్ (29), అశ్విన్ (42) ఆదుకున్నారు.టీమిండియాను గెలిపించే బాధ్యతను తీసుకుని కీలక ఇన్నింగ్స్ ఆడారు. మరో వికెట్ పడకుండా 71 పరుగుల భాగస్వామ్యంతో గెలిపించారు. అంతకుముందు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (34 ) ఒక్కడే రాణించాడు. ఇక బంగ్లా బౌలర్లలో మెహదీ హాసన్ 5 వికెట్లు, షకీబ్ 2 వికెట్లు తీశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News