Home Latest News WTC 2023 | డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా వెళ్లాలంటే ఇవి జరగాల్సిందే

WTC 2023 | డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా వెళ్లాలంటే ఇవి జరగాల్సిందే

WTC 2023 | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైన టీమిండియా.. రెండు మ్యాచ్‌లు నెగ్గి ఆ దిశగా వడివడిగా అడుగులు వేసినా మూడో మ్యాచ్లో పరాజయం పాలైంది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. భారత్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్ తరహాలో.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనే విశ్వ సమరాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు చాంపియన్షిప్‌కి తెరలేపగా.. తొలి ఎడిషన్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన గత డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైన ఐసీసీ గద దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో ఉన్న రోహిత్ సేనకు ఇండోర్ పరాజయం గట్టి దెబ్బకొట్టింది. తాజా సీజన్లో భారత్ కేవలం ఒకే టెస్టు ఆడనుండగా.. ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న చివరి మ్యాచ్‌లో టీమిండియా నెగ్గితే నేరుగా ఫైనల్‌కు చేరనుంది. ఓడినా అవకాశాలు ఉన్నా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.

డబ్లూ్యటీసీ రెండో ఎడిషన్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 11 విజయాలతో 68.52 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా 17 మ్యాచ్‌లు పది విజయాలతో 60.29 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ నాలుగో టెస్టులో ఓడినా.. ఆస్ట్రేలియా అగ్రస్థానంతోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరనుంది. అహ్మదాబాద్ పోరులో భారత్ విజయం సాధిస్తే.. 62.5 పాయింట్లతో ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడితే.. 56.94 పాయింట్లకు పడిపోనుంది. అప్పుడు శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.

భారత్ ఫైనల్ చేరాలంటే..

  • ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుతుంది. ఓడినా చాన్స్ ఉంది.
  • ఈ నెల 9 నుంచి శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అందులో శ్రీలంక 2-0తో గెలిస్తే భారత అవకాశాలు సంక్లిష్టంగా మరతాయి.
  • కివీస్తో సిరీస్ను లంక 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. భారత్ తమ చివరి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓడితే.. టీమిండియాకు ఇంటి బాట పట్టాల్సిందే.
  • న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఒక్క టెస్టులోనైనా ఓడితే.. భారత్ ముందంజ వేస్తుంది

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Exit mobile version