Home Latest News Axar Patel | ప్రేమించిన అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్

Axar Patel | ప్రేమించిన అమ్మాయిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్

Axar Patel | టీమిండియాలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. రెండు రోజుల క్రితం కేఎల్ రాహుల్‌- అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటవ్వగా… గురువారం రాత్రి భారత స్పిన్ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా పెళ్లి చేసేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మెహా పటేల్‌తో అక్షర్‌ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌తో పాటు సౌరాష్ట్ర క్రికెటర్లు జయ్‌దేవ్‌ ఉనద్కట్ తదితరులు హాజరయ్యారు.

మేహా పటేల్‌తో అక్షర్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జనవరి 20న మేహాకు అక్షర్ పటేల్ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. మేహా కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తమ ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ పటేల్ ప్రియురాలు మేహా విషయానికొస్తే ఆమె న్యూట్రిషనిస్ట్. వృత్తిరీత్యా డైటీషియన్ కావడంతో అక్షర్ పటేల్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీళ్లిద్దరికీ ట్రావెలింగ్ అంటే ఇష్టం. మేహా పటేల్ తన చేతి మీద AKSH అని టాటూ కూడా వేయించుకుంది.

వీళ్లిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అక్షర్, మేహా పటేల్ పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని.. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే పెళ్లి చేసుకుని అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అక్షర్ పటేల్ భావిస్తున్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ తన పెళ్లి విషయాన్ని మాత్రం అక్షర్ పటేల్ బయటపెట్టలేదు. కనీసం పెళ్లి తర్వాత ఫొటోలను కూడా షేర్ చేయలేదు. వివాహానికి హాజరైన మాజీ క్రికెటర్‌ కైఫ్‌ మ్యారేజ్‌ విషెస్‌ చెబుతూ ట్వీట్‌ చేయడంతో ఈ విషయం కాస్త బయటికి వచ్చింది. ఆ తరువాత పెళ్లి వేడుకకి హాజరైన బంధుమిత్రులు, క్రికెట్‌ అభిమానులు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం మొదలుపెట్టారు. అక్షర్ పటేల్ పెళ్లి విషయం తెలిసిన నెటిజన్లు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

టీమిండియా తరుఫున 8 టెస్టులు ఆడిన అక్షర్‌ పటేల్‌ 36 వికెట్లు పడగొట్టాడు. అక్షర్‌ పటేల్‌ 46 వన్డేలు, 39 టీ 20 మ్యాచులు ఆడిన అక్షర్‌ మొత్తంగా వైట్‌ బాల్‌ క్రికెట్‌ లో 71 వికెట్లు తీశాడు. మొత్తంగా 4 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sania Mirza | లాస్ట్ మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓటమి

mohemmad siraj | ధోనీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సిరాజ్‌

Shubman Gill | శుభ్‌మన్ గిల్ వీర విహారం.. 10 రోజుల్లోనే విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Exit mobile version