Home Latest News IPL 2023 | ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలం.. 80 మంది ఆటగాళ్లకు రూ.160 కోట్ల...

IPL 2023 | ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలం.. 80 మంది ఆటగాళ్లకు రూ.160 కోట్ల ఖర్చు.. అత్యధిక ధర పలికిన టాప్‌ 10 ఆటగాళ్లు వీళ్లే

pic credit: IPL twitter

IPL 2023 | ఐపీఎల్‌ మినీ వేలం ముగిసింది. వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 80 మంది ఆటగాళ్ల కోసం పోటీపడ్డాయి. దాదాపు రూ.160 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ అత్యధికంగా 18.5 కోట్లు పలికాడు. పంజాబ్‌ కింగ్స్‌ శామ్‌ కరన్‌ను రికార్డు స్థాయిలో ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరున్‌ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.17.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా శామ్‌ కరన్‌ రికార్డు సృష్టించగా.. రెండో ఆటగాడిగా కామెరున్‌ గ్రీన్‌ రికార్డు సృష్టించాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో శామ్‌ కరన్‌ అదరగొట్టాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం మీద ప్రపంచకప్‌ టోర్నీలో 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆయనను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు భారీ ధరకు పంజాబ్‌ దక్కించుకుంది.

మొత్తం మీద 80 మంది ఆటగాళ్లలో 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అత్యధిక ధర పలికిన టాప్‌ 10 ప్లేయర్లలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లే ముగ్గురు ఉన్నారు. ఐపీఎల్‌ మినీ వేలంలో చివరగా ఇంగ్లండ్‌ టెస్ట్ స్పెషలిస్ట్‌ జో రూట్‌ను కోటి రూపాయల కనీస ధరకు రాజస్థాన్‌ రాయల్స్‌ దక్కించుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌ బంధువు మయాంక్‌ దగర్‌ను హైదరాబాద్‌ రూ.1.80 కోట్లకు సొంతం చేసుకుంది.

IPL 2023 | అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లు వీళ్లే..

    శామ్‌ కరన్‌ రూ.18.5 కోట్లు ( పంజాబ్ కింగ్స్‌ )
    కామెరున్‌ గ్రీన్‌రూ. 17.50 కోట్లు (ముంబై ఇండియన్స్‌ )
    బెన్‌ స్ట్రోక్స్‌రూ.16.25 కోట్లు ( చెన్నై సూపర్‌ కింగ్స్‌ )
    నికోలస్‌ పూరన్‌రూ. 16 కోట్లు ( లక్నో సూపర్‌ జెయింట్స్ )
    హ్యారీ బ్రూక్‌రూ.13.25 కోట్లు ( హైదరాబాద్‌ )
    మయాంక్‌ అగర్వాల్‌రూ.8.25 కోట్లు ( హైదరాబాద్‌ )
    శివమ్ మావి రూ.6 కోట్లు ( గుజరాత్‌ )
    జేసన్‌ హోల్డర్‌రూ.5.75 కోట్లు ( రాజస్థాన్‌ )
    ముఖేశ్‌ కుమార్‌రూ.5.5 కోట్లు ( దిల్లీ )
    హెన్రిక్‌ క్లాసెస్‌రూ.5.25 కోట్లు ( హైదరాబాద్‌ )

    Follow Us : FacebookTwitter

    Read More Articles |

    Argentina team | ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా.. మెస్సీతో సహా కీలక ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

    FIFA World cup | ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. గెలిచిన జట్టుకు నకిలీ ట్రోఫీనే ఇస్తారట.. కారణమిదే !

    ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.. కారణమిదేనా?

    FIFA World cup 2022 | నెరవేరిన మెస్సీ కల.. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం.. విశ్వవిజేతగా అర్జెంటీనా

    Exit mobile version