Home News International Argentina team | ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా.. మెస్సీతో సహా కీలక...

Argentina team | ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆనందంలో అర్జెంటీనా.. మెస్సీతో సహా కీలక ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

Argentina team | ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచిన సంబరాల్లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. ప్రపంచకప్‌తో స్వదేశంలో అభిమానులతో కలిసి సంబురాలు చేసుకుంటున్న సమయంలోనే ఆటగాళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

విజయోత్సవ వేడుకల్లో భాగంగా మెస్సీతో పాటు ఐదుగురు ఆటగాళ్లు ట్రోఫీతో పాటు బస్సు టాప్‌పై కూర్చున్నారు. బ్యూనస్‌ ఎయిర్స్‌ నగరంలో బస్సు పర్యటిస్తున్న సందర్భంలో ఒక్కసారి విద్యుత్‌ తీగ ఆటగాళ్లకు అడ్డుగా వచ్చింది. మొదట్లో విద్యుత్‌ తీగలను ఎవరూ గమనించలేదు. అయితే సమీపంలోకి వచ్చేసరికి ఓ ఆటగాడు గమనించి అందరినీ అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. అందరూ కిందకు వంగడంతో సేఫ్‌గా బయటపడ్డారు. అయితే విద్యుత్‌ షాక్‌ రాకపోయినా.. వైర్లు తగిలి కిందపడిపోయే అవకాశం అయితే ఉండేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఉత్కంఠ పోరులో ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించిన అర్జెంటీనా జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. బ్యూనస్‌ ఎయిర్స్‌ ఎయిర్‌పోర్టు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నగరంలో పర్యటించేందుకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడంతో ఆటగాళ్లంతా బస్సుపై ఎక్కి ట్రోఫీ చూపిస్తూ సందడి చేశారు. ఈ సమయంలోనే ప్రమాదం తప్పింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్‌.. కవిత, మాగుంట పేర్లు ప్రస్తావించిన ఈడీ

KTR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Sircilla kidnap | సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్… మేమిద్దరం ప్రేమించుకున్నాం.. తల్లిదండ్రులతోనే మాకు ప్రాణహాని..

Digvijaya singh on TPPC | తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఫోకస్.. రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్‌

Exit mobile version