Home Latest News India Vs Australia | చివరి రెండు టెస్టులు.. వన్డే సిరీస్‌కు ఎంపికైనా భారత జట్టు...

India Vs Australia | చివరి రెండు టెస్టులు.. వన్డే సిరీస్‌కు ఎంపికైనా భారత జట్టు ఇదే.. జాబితా విడుదల చేసిన బీసీసీఐ

Image Source: Indian Cricket Team facebook

India Vs Australia | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో మొదటి రెండు టెస్టులు గెలిచిన భారత జట్టు ఊపుమీదుంది. ఈ నేపథ్యంలోనే చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌ కోసం భారత జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది. చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా తర్వాత తొలిసారి భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

అయితే మొదటి రెండు టెస్టులకు ఉన్న జట్టునే చివరి రెండు టెస్టులకు కూడా కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశ పరిచిన వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను చివరి రెండు టెస్టులకు ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీ ఆడేందుకు వెళ్లిన పేస‌ర్ జ‌య‌దేవ్ ఉనద్కత్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. చివరి రెండు టెస్టుల‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా ఉనద్కత్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ.

కాగా మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు మాత్రమే రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆ తర్వాతి రెండు వన్డేలకు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తారని బీసీసీఐ పేర్కొంది. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదని అందుకే చివరి రెండు వన్డేలకు హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

  • భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య‌ ఇండోర్ వేదిక‌గా మార్చి 1 నుంచి మార్చి 5 వరకు మూడో టెస్టు జరగనుంది.
  • నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మ‌దాబాద్‌లో జ‌ర‌గ‌నుంది.
  • మొద‌టి వ‌న్డే మార్చి 17న ముంబైలో
  • మార్చి 19న విశాఖ‌ప‌ట్నం వేదికగా రెండో వ‌న్డే
  • మార్చి 22న చెన్నైలో మూడో వ‌న్డే జరగనుంది.

టెస్టు జ‌ట్టుః

రోహిత్ శ‌ర్మ , కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్, పూజారా, కోహ్లీ, కేఎస్ భ‌ర‌త్ , ఇషాన్ కిష‌న్ , శ్రేయాస్ అయ్య‌ర్, అశ్విన్, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీ, సిరాజ్, ఉమేశ్ యాద‌వ్, జ‌య‌దేవ్.

వ‌న్డే జ‌ట్టుః

రోహిత్ శ‌ర్మ , గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్య‌కుమార్ , కేఎల్ రాహుల్, ఇషాన్ కిష‌న్ , హార్ధిక్ పాండ్యా, జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, చాహ‌ల్, ష‌మీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్ష‌ర్ ప‌టేల్, జ‌య‌దేవ్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sankranti Movies in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Taraka Ratna | అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నభార్య అలేఖ్య రెడ్డి.. ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Exit mobile version