Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsWeather Report | గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్...

Weather Report | గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి!

Weather Report | ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి తీవ్రత ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతోంది. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘ కాలిక వ్యాధులతో ఇబ్బందులు పడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను వణికించనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి సహా 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉదయం, రాత్రిపూటనే కాదు మధ్యాహ్నం కూడా చలి వణికించనుంది. ఆది, సోమవారాల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. జనవరి 11 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర భారతంలో మంచు దుప్పటి

ఉత్తర భారతంలో చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. భారీగా పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 3 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సప్ధర్‌గంజ్ ప్రాంతంలో కేవలం 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్‌లోనూ చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు, 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందండి

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News