Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowBath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Bath in winter | చలికాలంలో పొద్దున్నే స్నానం చేయడం అంటే యుద్ధం చేసినట్టేనని చాలామంది ఫీలవుతుంటారు. బలవంతంగా స్నానానికి పంపిస్తే సలసల మరిగే నీళ్లు ఉండాలని కండీషన్‌ పెడతారు. అలా వేడి వేడి నీటిని ఒంటిపై పోసుకుంటేనే హ్యాపీగా ఫీలవుతుంటారు. అదే చన్నీటితో చేయమంటే గజగజ వణకడం కంటే స్నానం చేయకపోవడమే బెటర్‌ అని అనుకుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఏది కరెక్ట్‌? చన్నీటి స్నానం చేస్తే బెటరా? వేడి నీటితో చేస్తే మంచిదా? అని ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా?

ఉదయం వద్దు

నిజానికి వేడి నీటి కంటే కూడా చల్లటి నీటితో స్నానం చేయడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వేడి నీటితో స్నానం చేస్తే బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతుంది. దానివల్ల నిద్ర వచ్చినట్టుగా అవుతుంది. మత్తుగా ఉండటం వల్ల రోజంతా అలసిపోయిన ఫీలింగ్‌ ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం కంటే కూడా సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయడం బెటర్‌. బాడీ రిలాక్స్‌ అవ్వడం వల్ల రాత్రి హాయిగా నిద్రపడుతుంది. అలసిపోయిన కండరాలకు ఉపశమనం లభిస్తుంది. అలా అని బాగా మరిగిన నీటితో స్నానం చేయడం మంచిది కాదు. గోరువెచ్చటి నీటితోనే స్నానం చేయాలి.

అందానికి చన్నీటి స్నానం

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ముఖంపై ఉన్న చిన్న రంధ్రాలు తగ్గిపోతాయి. దీని వల్ల ముఖం నిగారిస్తుంది. అందుకే చాలామంది ఉదయాన్నే ఐస్‌ మాస్క్‌ వేసుకుంటారు. దీనివల్ల ముఖంపై రంధ్రాలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. అందంగా కనిపిస్తారు.

వీళ్లు చన్నీటి స్నానం చేయకపోవడమే మంచిది

మైగ్రేన్‌ వంటి సమస్యలతో బాధపడేవారు చల్లటి నీటితో స్నానం చేయకపోవడమే మంచిది. చన్నీటితో స్నానం చేస్తే తలనొప్పి, తల పట్టేసినట్టుగా ఉంటుంది. దీనివల్ల మైగ్రేన్‌ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి వీళ్లు ఉదయం పూట గోరువెచ్చటి నీటితోనే స్నానం చేయాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News