Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHealthIs eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Is eggs good in winter | శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు గుడ్లలో దొరుకుతాయి. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో గుడ్లను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటుంటారు. మరి అవేంటో చూద్దాం..

శరీరానికి కావాల్సినంత ఉష్ణోగ్రత అందుతుంది.

చలికాలం వచ్చిందంటే శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. శరీరాన్ని వెచ్చగా ఉండేందుకు కావాల్సిన ప్రోటీన్‌, కాల్షియం గుడ్లలో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రోజూ ఉడికించిన గుడ్లను తినడం ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చు. రోజూ గుడ్లను తినడం వల్ల బలంగా కూడా తయారవుతారు.

ఇమ్యూనిటీ పెంచుతుంది

రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు రోజూ గుడ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తి అందుతుంది. అయితే ఆమ్లెట్‌ వేసుకోవడం కంటే గుడ్లను ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. గుడ్లలో ఉండే విటమిన్‌ డి శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీని అందిస్తుంది. ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది.

Brown nd White Eggs

మతిమరుపు

గుడ్లలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌, కోలిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తాయి. దీనివల్ల మతిమరుపు, పార్కిన్సన్‌ ( వణుకుడు రోగం ) రాకుండా ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. కాబట్టి గుండెపోటు ముప్పు కూడా తప్పుతుంది.

కళ్లను కాపాడుతాయి

గుడ్లలో లుటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే విటమిన్‌ ఏ, విటమిన్‌ ఈ, జింక్‌ సెలీనియం వంటి పోషకాలు కంటి జీవకణాన్ని రక్షిస్తాయి. ఫలితంగా కంటి దోషాలు రావు.

ఐరన్‌

గుడ్లలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. రోజూ గుడ్లను తినడం వల్ల అలసత్వం తగ్గుతుంది. మహిళలు రక్తహీనత నుంచి బయటపడతారు.

మధుమేహులు జాగ్రత్త

గుడ్డులో 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. ఇది వారం రోజుల పాటు శరీరానికి అవసరమైన కొవ్వుతో సమానం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంత ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్‌ ఉంటుంది కాబట్టి డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు గుడ్లను తినకపోవడమే మంచిది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News