Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHealthHeart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం...

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Heart Attack | ఇటీవలి కాలంలో కరోనా తర్వాత చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు 50 ఏళ్ల వయసు దాటిన వాళ్లలోనే గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా.. 20 ఏండ్ల యువతీ, యువకులు కూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు అని గుర్తించే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతకీ గుండెపోటుని ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాలి ?

సాధారణంగా కొందరిలో తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల ఛాతిలో మంట వస్తుంది. దాన్ని కూడా గుండె నొప్పి అని అనకుంటున్నారు. కంగారుపడిపోతున్నారు. కానీ గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల కూడా ఛాతిలో నొప్పి వస్తుంటుంది. కానీ ఉన్నట్టుండి ఆయాసం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే.

వీటితో పాటు ఒక్కోసారి పొట్ట ఉబ్బరంగా కూడా అనిపిస్తుంటుంది. తేన్పులు ఎక్కువగా రావడం జరగుతుంది. ఉన్నట్టుండి వాంతులవుతాయి. వీటన్నింటినీ గుండెపోటు లక్షణాలుగా పరిగణించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో ఇలాంటి లక్షణాలు తరచూ వస్తుంటాయి. అలాంటప్పుడు బీపీ చెక్‌ చేసుకోవడం, పొగతాగే అలవాటు ఉందా అనేది పరిగణలోకి తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా చిన్నప్పుడు గుండెపోటు రావడం, ఉబకాయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అనుమానం అనిపిస్తే వెంటనే ఈసీజీ తీసుకుంటే గుండెజబ్బా.. కాదా అనేది తెలిసిపోతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Heart attack | గుండెపోటు అని అనుమానం వస్తే ఈసీజీతో పాటు ఈ పరీక్షలు ఎందుకు చేస్తారు ?

Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందండి

Bone Health | ఎముకలు బలంగా కావాలంటే.. రోజూవారీ భోజనంలో వీటిని తప్పనిసరి చేసుకోవాలి!

Health Tips | రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇదిగో ఇవి తింటే మీ సమస్య తీరినట్టే!

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News