Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentSreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Sreeleela | శ్రీలీలకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో శ్రీలీల నటించిన రెండు సినిమాలు కూడా హిట్ కావడంతో ఈమెకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. చూడ్డానికి క్యూట్‌గా ఉండటంతో పాటు గోల్డెన్ లెగ్ కావడంతో కుర్ర హీరోలంతా ఈ బ్యూటీ వెనకాలే పడుతున్నారు. దీంతో ఇప్పుడు ఈమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇంకా సినిమా ఆఫర్లు ఇస్తామంటూ డైరెక్టర్స్ వెనక బడుతున్నారు. ఇలా వరుస అవకాశాలు వస్తుంటే శ్రీలీల మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాను వదులుకుంది. ఇప్పుడు ఈ న్యూ్స్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్. మరో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. SSMB28 పేరుతో సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం జరగడం లేదు. ఫారిన్ ట్రిప్‌లో ఉన్నప్పుడు పూజా హెగ్డే గాయపడింది. దీంతో కొద్దిరోజులు షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో విషాదంతో షూటింగ్ ఇంకొద్దిరోజులు పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో ఈపాటికే కంప్లీట్ కావాల్సిన సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. దీంతో శ్రీలీలకు డేట్స్ అడ్జస్ చేయడం కష్టమైపోయింది.

శ్రీలీల చేతిలో ఆరు ఏడు సినిమాలు ఉన్నాయి. రీసెంట్‌గా ధమాకా సినిమాతో హిట్ అందుకున్న శ్రీలీల.. రామ్ పోతినేని సినిమా సెట్‌లో జాయిన్ అయ్యింది. ఇది కాకుండా నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే నితిన్, వైష్ణవ్ తేజ్, గాలి జనార్దన్ రెడ్డి కుమారుడి సినిమాలకు సైన్ చేసింది. మహేశ్ సినిమా అయిపోగానే ఈ సినిమా షూటింగ్స్‌కి వెళ్లొచ్చని శ్రీలీల అనుకుంది. కానీ SSMB28 మాత్రం వరుసగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కావడం కుదరట్లేదు. పైగా ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ రోల్ కాదు. తనకు ఏ ఫేమ్ లేని టైమ్‌లో ఈ సినిమాను ఒప్పుకుంది. ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత టాలీవుడ్‌లో శ్రీలీల క్రేజ్ పెరిగిపోయింది. ఈ రెండు కారణాలతో శ్రీలీల మహేశ్ బాబు – త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్‌లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News