Home Latest News SI Exams Schedule | ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్ష తేదీల్లో మార్పులు… ప్రకటించిన రిక్రూట్‌మెంట్ బోర్డు!!

SI Exams Schedule | ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్ష తేదీల్లో మార్పులు… ప్రకటించిన రిక్రూట్‌మెంట్ బోర్డు!!

SI Exams Schedule | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్య సమాచారం ఇచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్‌ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్, పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రిక్రూట్‌ మెంట్‌ బోర్డు వెల్లడించింది.

మొత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష, ఐటీ విభాగానికి చెందిన పరీక్ష 30 వ తేదీన, ఎస్సై (ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11 వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11 వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు.

మొదట ప్రకటించిన పరీక్ష తేదీల్లో ఇతర పరీక్షలు ఉన్నాయని వచ్చిన వినతుల మేరకే తేదీల్లో మార్పులు చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఈ విభాగాలకు ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

అందులో అర్హత సాధించిన వారికి డిసెంబర్‌ నెలలో ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఇందులో 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ వెల్లడించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

TSRTC MD Sajjanar | సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? కార్లెందుకు.. బస్సులో వెళ్లండి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Exit mobile version