Home News International Donald Trump | ట్రంప్‌ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురుచూస్తున్నాం.. ఇరాన్ హెచ్చరిక

Donald Trump | ట్రంప్‌ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురుచూస్తున్నాం.. ఇరాన్ హెచ్చరిక

Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హతమారుస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్ వైమానిక దళ చీఫ్ అమిరాలి హజిజాదే స్పష్టం చేశారు. ఆ దేశ అధికారిక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 1650కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఛేదించగలిగే క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

2020లో బాగ్దాద్‌లో అమెరికా బలగాలు డ్రోన్ దాడి చేసి ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసిమ్ సులేమానీని హతమార్చాయి. దానికి ప్రతీకారంగానే ఇరాక్‌లోని అమెరికా దళాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామని వివరించారు. అమాయక ప్రజలను చంపాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే సులేమాని హత్య సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు మాత్రం ఎదురుచూస్తున్నామని తెలిపారు. సులేమాని హత్యకు ఆదేశించిన అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో, అప్పటి మిలటరీ కమాండర్లను ప్రాణాలతో ఉండనివ్వమని చెప్పారు.

సులేమాని మరణం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతీకారం తీర్చుకుంటామని అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది. ఈ క్రమంలోనే రష్యాతో సత్సంబంధాలను వృద్ధి చేసుకుంటున్న ఇరాన్.. ఆ దేశానికి డ్రోన్లను కూడా సరఫరా చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఈ డ్రోన్లను రష్యా ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. యూరోపియన్ దేశాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలు చేపట్టడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

Exit mobile version