Home Latest News Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

Australia | టైమ్ 2 న్యూస్, మెల్‌బోర్న్: ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ కోసం బలమైన జట్టును ఎంపిక చేసింది. వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులు గల జట్టుకు టెస్టు కెప్టెన్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. గాయాల కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన డేవిడ్ వార్నర్, మిషెల్ స్టార్క్తో పాటు ఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, మిషెల్ మార్ష్ రాకతో ఆ జట్టు బలంగా కనిపిస్తున్నది. సిరీస్లో తొలి మ్యాచ్ మార్చి 17న ముంబైలో జరుగనుండగా.. రెండో వన్డేకు (మార్చి 19) విశాఖపట్నం వేదిక కానుంది. మార్చి 22న చెన్నైలో చివరి పోరు జరుగుతుంది. వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లిన కమిన్స్.. మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్న మూడు టెస్టు వరకు అందుబాటులో ఉండనుండగా.. గాయంతో చివరి రెండు టెస్టులకు దూరమైన విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్కు కూడా జట్టులో చోటు దక్కింది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన మ్యాక్స్వెల్, మార్ష్ వాటి నుంచి కోలుకొని తాజాగా బరిలోకి దిగనున్నారు. సీనియర్ పేసర్ జోష్ హజిల్వుడ్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు.

వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా..

ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది. టెస్టు సిరీస్లో భారత స్పిన్ ధాటికి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న కంగారూలు.. వన్డేల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరం. గతేడాది అక్టోబర్లో ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించగా.. కమిన్స్ జట్టును చక్కగా నడుపుతున్నాడని ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ చీఫ్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న వరల్డ్కప్నకు ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డే సిరీస్లు జరుగనుండటం గమనార్హం. ‘మెగాటోర్నీకి ముందు టీమిండియాతో సిరీస్లు మా సన్నద్ధతకు సరిగ్గా సరిపోతాయి. మ్యాక్స్వెల్, మార్ష్, రిచర్డ్సన్ చాలా ప్రతిభావంతులు. వారి రాకతో జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. హజిల్వుడ్ కూడా ముఖ్యమే కానీ.. ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్ను దృష్టిలో పెట్టుకొని అతడిని ఈ సిరీస్కు పరిగణనలోకి తీసుకోలేదు’ అని బెయిలీ తెలిపాడు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆగర్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హేడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిషెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, జే రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిషెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version