Home Entertainment Naatu Naatu Song | నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన పాక్ నటి.. వీడియో వైరల్

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన పాక్ నటి.. వీడియో వైరల్

Naatu Naatu Song | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మన దేశంలోనే కాదు విదేశీయులకు కూడా తెగ నచ్చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను అయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్.. స్క్రీన్‌పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్టెప్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పాటకు కాళ్లు కదుపుతున్నారు. రీల్స్ చేసి పాపులర్ అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నుంచి నాటు నాటు సాంగ్ వచ్చి ఏడాది అవుతున్నా దీని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు అందుకున్న ఈ సాంగ్ తాజాగా హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ (హెచ్‌సీఏ) అవార్డును అందుకుంది. ఆస్కార్ అవార్డుల కోసం ఫైనల్ నామినేషన్ లిస్టుకు కూడా ఎంపికైంది. త్వరలోనే ఈ సాంగ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని అంతా అనుకుంటున్నారు. దీన్ని బట్టి నాటు నాటు సాంగ్‌కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీయులు కూడా నాటు నాటు సాంగ్‌కు హుక్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నటి కూడా నాటు నాటు పాటకు స్టెప్పులు వేసి సందడి చేసింది.

పాక్ నటి హనియా ఆమీర్ ఇటీవల ఓ పెళ్లి వేడుకలో పాల్గొంది. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన బంధువులు చూస్తుండగా.. నాటు నాటు పాటకు హుక్ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రాజమౌళిని, భారతీయ చలనచిత్ర పరిశ్రమను పొగిడేస్తున్నారు. ఈ సాంగ్ వరుసగా అంతర్జాతీయ అవార్డులను పొందడం పట్ల గర్వంగా ఫీలవుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

Exit mobile version