Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsWarangal Medical Student Death | నా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్య.. ప్రీతి తండ్రి...

Warangal Medical Student Death | నా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్య.. ప్రీతి తండ్రి సంచలన వ్యాఖ్యలు

Warangal Medical Student Death | ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనంటూ ఆమె తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారని అన్నారు. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్ మెడికల్ కాలేజీలో అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్ చేసిన తర్వాతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలన్నారు. అలా అయితేనే ప్రీతి మృతిపై నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు.

అంతేకాదు.. వేధించిన వ్యక్తిని హెచ్చరించి ఉంటే నా బిడ్డ బతికేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి పోస్టుమార్టం కోసం తరలించే క్రమంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ప్రీతి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తన కూతురు ఎలా చనిపోయింది.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Hyderabad | ఫ్రెండ్ గుండె, మర్మాంగం కోసి ప్రేయసికి వాట్సాప్‌లో పంపిన బీటెక్ విద్యార్థి.. అమ్మాయిపైనా కేసు.. ట్రైయాంగిల్ లవ్‌‌స్టోరీలో కొత్త ట్విస్ట్..

Medical Student Preethi | ప్రీతిది ఆత్మహత్య కాదు.. పీజీ వైద్య విద్యార్థిని మరణంపై పలు అనుమానాలు.. నిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి

Medical Student Preethi | మెడికల్ విద్యార్థి ప్రీతి కన్నుమూత.. ప్రకటించిన నిమ్స్ ఆస్పత్రి వైద్యులు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News