Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsMedical Student Preethi | మెడికల్ విద్యార్థి ప్రీతి కన్నుమూత.. ప్రకటించిన నిమ్స్ ఆస్పత్రి వైద్యులు

Medical Student Preethi | మెడికల్ విద్యార్థి ప్రీతి కన్నుమూత.. ప్రకటించిన నిమ్స్ ఆస్పత్రి వైద్యులు

Medical Student Preethi | వరంగల్‌లో ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె రాత్రి 9.16 గంటలకు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కాగా.. సాయంత్రం మీడియా ముందు మాట్లాడిన ప్రీతి తండ్రి.. ఆమె ఆరోగ్యంపై భయాందళన వ్యక్తం చేశారు. బతికే అవకాశం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో వైద్యులు ప్రకటన చేయడంతో ప్రీతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నా కూతురు బతుకుతుందన్న ఆశ లేదు.. శరీరం కూడా రంగు మారుతుంది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రీతి తండ్రి

వరంగల్‌లో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి పరిస్థితి మరింత దిగజారిపోయింది. నిమ్స్‌లో చేరినప్పటికీ.. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం చాలా క్షీణించింది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పారని ప్రీతి తండ్రి నరేంద్ర తెలిపారు. తన బిడ్డను చూస్తుంటే భయంగా ఉందని అన్నారు. ప్రీతికి బ్రెయిన్ డెడ్‌ అయ్యిందని వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ.. తను బతుకుతుందన్న ఆశ కూడా లేదని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొన్నారు.

చికిత్స కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందని ప్రీతి తండ్రి నరేంద్ర అన్నారు. ప్రీతి శరీరం రంగు కూడా మారిపోతోందని విలపించారు. ప్రీతి బతుకుతుందని నిన్నటి వరకు కొంత ఆశ ఉండేదని, ఇప్పుడది కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు కూడా ప్రీతి బతికే అవకాశం లేదనే చెబుతున్నారని విలపించాడు.

కాగా, ఆత్మహత్యకు ముందు ప్రీతి తన తల్లికి ఫోన్ చేసి బాధపడిన కాల్ రికార్డింగ్ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ కాల్ రికార్డింగ్ ప్రకారం.. సీనియర్ సైఫ్ తనను ఒక్కదాన్నే కాదు.. ఇంకా చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లితో చెప్పుకొని బాధపడింది. సీనియర్లు అంతా ఒక్కటిగా ఉన్నారని.. సైఫ్ మీద ఫిర్యాదు చేస్తే వాళ్లంతా తననున దూరం పెడతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా ఉంటే తన దగ్గరకు రావాలని.. ప్రిన్సిపల్ దృష్టికి ఎందుకు వెళ్లారని హెచ్‌వోడీ సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చింది. నాన్న పోలీసులతో సైఫ్‌కు ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందని బాధపడింది. ప్రీతి బాధపడటం చూసిన ఆమె తల్లి చాలా ఓదార్చింది. అయినప్పటికీ ఆందోళనకు గురైన ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News