Saturday, July 13, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

Telangana | సారీ డాడీ.. నాకు భయమేస్తోంది.. ఇదీ ఓ యువతి చనిపోయే ముందు తన తండ్రికి రాసిన చివరి లేఖ. అలా అని ఆ యువతి ఏదో చెయ్యకూడని నేరమేదో చేసిందని అనుకుంటున్నారేమో! అంత పెద్ద తప్పేమీ చేయలేదు. పావు తులం ఉంగరాన్ని పోగొట్టుకుంది అంతే. కానీ ఈ విషయం తెలిస్తే తన తల్లిదండ్రులు మందలిస్తారేమోనని చాలా భయపడిపోయింది. పోయిన ఉంగరం కోసం అంతటా వెతికింది. ఎక్కడా దొరక్కపోవడంతో వారం రోజుల పాటు తనలో తాను కుమిలిపోయింది. ఆ భయాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయేముందు తన తండ్రిని క్షమించమని వేడుకుంటూ ఓ లేఖ రాసింది.

వరంగల్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లికి చెందిన మద్దుల జానకీరాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కూతురు హేమలతా రెడ్డి (19) హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం సెకండ్‌ ఇయర్‌ చదువుతుంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీన హేమలత గున్నేపల్లిలోని ఇంటికొచ్చింది. ఈ నెల 22న తన చేతికి ఉన్న పావుతులం బంగారపు ఉంగరాన్ని ఎక్కడో పోగొట్టుకుంది. పోయిన ఉంగరం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్నెల్ల కిందట కూడా ఇలాగే ఒక బంగారపు గొలుసును హేమలత పోగొట్టుకుంది. తాజాగా ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారేమోనని తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పొలానికి వెళ్లిన జానకీరాములు – రాణి దంపతులు ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు తలుపులు కొట్టిన తెరకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. హేమలతారెడ్డి ఉరికి వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై ఆరా తీశారు. ఆమె ఫోన్‌లోని స్నేహితుల నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కున్నారు. ఈ క్రమంలో ఇంట్లో తండ్రికి రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. అందులో సారీ డాడీ.. నాకు భయమేస్తోంది అంటూ హేమలతారెడ్డి తన తండ్రికి బాధపడుతూ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News