Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsIAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన...

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

IAS Divya S Iyer | మారుతున్న ఈ సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళలు, యువతులే కాదు బాలికలు కూడా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తమ చిన్నతనంలో ఇలా లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవలికాలంలో చాలామంది నటీమణులు బయటపెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి కూడా చేరిపోయారు. తనకు ఆరేళ్ల వయసులో ఎదురైన చేదు అనుభవాన్ని పథనంథిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్ తాజాగా బయటపెట్టారు.

కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన పథనంథిట్ట కలెక్టర్ దివ్య తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గురించి వివరించారు. ” నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నన్ను ఆప్యాయంగా పిలిచారు. నేను వాళ్ల వద్దకు వెళ్లా. అసలు వాళ్లెవరు? నన్ను ఎందుకు ముట్టుకున్నారు? ఆప్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. వాళ్లు నా బట్టలు విప్పినప్పుడు బాధగా అనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయా ” అంటూ పథనంథిట్ట కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్ వెల్లడించారు. ఆ సంఘటనతో మానసికంగా ఎంతో క్షోభను అనుభవించానని పేర్కొన్నారు. అమ్మానాన్నల సహాయంతో ఆ బాధ నుంచి బయటపడ్డానని తెలిపారు. ఆ సంఘటన తర్వాత వాళ్లిద్దరూ ఎక్కడైనా కనిపిస్తారేమో అని చూశానని.. కానీ ఎక్కడా కనిపించలేదని చెప్పారు. వారి ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయంటే తనకు చిన్నతనంలో ఎదురైన చేదు జ్ఞాపకాన్ని వివరించారు. అందుకే చిన్నతనంలోనే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News