Monday, April 15, 2024
- Advertisment -
HomeNewsInternationalViral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా...

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Viral News | ఆలుమగలు అన్నాక అలకలు.. అనుమానాలు కామన్! కట్టుకున్నవాడు ఏ అమ్మాయితో చనువుగా మాట్లాడినా.. నవ్వుతూ పలకరించినా భార్యలు అస్సలు తట్టుకోలేరు. ఎవరామె.. నీతో ఎందుకు అంతలా రాసుకుపూసుకు తిరుగుతుంది.. ఆమెకు ఇంకా ఎవడు దొరకట్లేదా అంటూ భర్తకు సవాలక్ష ప్రశ్నలు సంధిస్తారు. సమాధానం చెప్పేలోపే అరిచి గోల పెట్టేస్తారు. పరిచయం లేని అమ్మాయితో మాట్లాడితేనే అనుమానాలు వస్తాయి.. అలాంటిది నిజంగా సంబంధం ఉన్న అమ్మాయితో మాట్లాడితే ఇంకా ఏమైనా ఉందా? ఏడుపు పెడబొబ్బులతో ఇల్లు పీకి పందిరేస్తుంది కదూ! కానీ అందరి భార్యలతో పోలిస్తే ఈమె చాలా డిఫరెంట్! కాదు కాదు.. అసలు ఇలాంటి భార్య ఈ లోకంలోనే ఉండేదోమో !! ఎందుకని అంటారా? ఆమెకు తన భర్త ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఇబ్బంది లేదంట. ఆనాడు సతీ సుమతి తన భర్తను స్వయంగా వేశ్య ఇంటికి తీసుకెళ్తే.. ఈ నవయుగ సుమతి తన భర్త ఎంతమందితో పడుకున్నా తనకు ఇష్టమే అని అంటోంది. ఆయనగారి సంతోషం కోసం ఏదైనా చేస్తా అని చెబుతోంది.

భర్తకు అంత ఫ్రీడమ్ ఇచ్చిన ఆ భార్య పేరు మోనికా హాల్ట్. ఆమె వయసు 37 ఏళ్లు. అమెరికాకు చెందిన మోనికా పెళ్లయినప్పటి నుంచీ తన భర్త జాన్‌ను సంతోషంగా ఉంచేందుకు అనుక్షణం పాటుపడుతోంది. అతని కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకుంది. అందుకే ఉద్యోగం కూడా చేయకుండా ఇంటికే పరిమితమైపోయింది. ఇంటి పనులు చేయడం నుంచి మొదలు పెడితే భర్త బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం.. అతనికి నచ్చినట్టుగా ఇంటిని అలంకరించడం, అతనికి ఇష్టమైన వంటకాలను చేసి పెడుతూ రోజంతా గడిపేస్తోంది. అంతెందుకు ఆమె వేసుకునే బట్టల నుంచి తినే తిండి దాకా భర్తకు నచ్చినట్టుగానే నడుచుకుంటోంది.

తన భర్తకు సెక్సీ, స్పోర్టీ డ్రెస్సులు ఇష్టమని ఇంట్లో కడా అవే వేసుకుని తిరుగుతుంది. భర్తకు ఇష్టం ఉండదని మేకప్ వేసుకోవడం కూడా మానేసింది. ఇలా తన భర్తను సంతోషంగా ఉంచేందుకు అనుక్షణం పాటుపడుతోంది. ఈ క్రమంలో భర్తతో బయటకు వెళ్లడానికి సమయం దొరకట్లేదు. తన వల్ల తన భర్త నిరాశ చెందకూడదని నచ్చిన అమ్మాయిలతో ఎంచక్కా తిరిగి రమ్మని సలహాలు ఇస్తోంది. వాళ్లతో శృంగారంలో పాల్గొన్న తనకు ఏ సమస్యా లేదని సూచిస్తోంది. ఎలాగైనా సరే మీరు సంతోషంగా ఉంటే చాలని భర్తకు చెబుతోంది. తాజాగా మోనికా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇలాంటి భార్య దొరకడం నిజంగా జాన్ అదృష్టమని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి భార్య ఉంటే కాపురంలో ఏ గొడవలు రావని.. జీవితం ఆనందంగా సాగిపోతుందని అంటున్నారు. ఒకరకంగా జాన్‌ను చూసి కుళ్లుకుంటున్నారు కూడా.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్

World Idli Day | ఇడ్లీలకు ఒక రోజు ఉందని తెలుసా? ఆటో డ్రైవర్‌ బర్త్‌ డే.. వరల్డ్‌ ఇడ్లీ డేగా ఎలా మారింది?

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Telangana | పావు తులం ఉంగరం పోయిందని ప్రాణాలు తీసుకున్న యువతి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News