Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsNitin Gadkari | 15 ఏళ్లు దాటిన ఆ వాహనాలన్నీ ఇక తుక్కే.. కేంద్రమంత్రి నితిన్...

Nitin Gadkari | 15 ఏళ్లు దాటిన ఆ వాహనాలన్నీ ఇక తుక్కే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

Nitin Gadkari | ఇప్పటి వరకు 15 ఏళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వాహనాలు, రవాణా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సులను వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అంతేకాకుండా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా అప్పటికప్పుడు రద్దు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాటి బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు ఆ స్థానంలో నడుస్తాయని చెప్పారు.

పరిశ్రమల సంస్థ అయినటువంటి ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ఇప్పటి వరకు 9 లక్షల వాహనాలకు 15 ఏళ్లు దాటినట్లు గుర్తించాం. కాలుష్య కారక బస్సులు, కార్లు లిస్టులో అలాంటివి అన్ని పక్కకెళ్లిపోతాయి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు వస్తాయి. దాని ఫలితంగా వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇథనాల్‌, మిథనాల్‌, బయో సీఎన్ జీ, బయో ఎల్‌ఎన్‌జీ వాహనాల వినియోగానికి గవర్నమెంట్‌ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ నమోదై 15 ఏళ్లు పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని పాత వాహనాలను వదిలించుకోవాలి.వాటిని కూడా చట్ట ప్రకారం రిజిస్టరైన తుక్కు పరిశ్రమలకే వాటిని తరలించాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TS Budget | గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పడంతో తొలగిన ప్రతిష్టంభన.. బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Dharmapuri Arvind | సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెన్సేషనల్ కామెంట్స్

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News