Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (31-01-2023)

Horoscope Today | రాశిఫలాలు (31-01-2023)

Horoscope Today | మేషం

గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

వృషభం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాలవారికి సన్మాన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విద్యార్థులు నూతన విద్య అవకాశాలు పొందుతారు. నూతన వస్తు సేకరణకు అవకాశం ఉంది.

మిథునం

ముఖ్యమైన పనుల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం అందుతుంది. సంతానం నుంచి ధనలాభం పొందుతారు. నూతన విద్య అవకాశాలు పొందే సూచన ఉంది.

సింహం

బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గృహ, ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన కాలం. నూతన వస్తు కొనుగోలు సూచన ఉంది.

కన్య

కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలుగజేస్తుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వాహన కొనుగోలు సూచన ఉంది.

తుల

బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభ సూచన ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటారు. విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు పొందే సూచన ఉంది.

వృశ్చికం

అనుకోని ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఎంతకష్టపడ్డా ఫలితం ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం సంతోషాన్ని కలగజేస్తుంది.

ధనుస్సు

నూతన వ్యాపారాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు వస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

మకరం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు .అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు సూచన ఉంది.

కుంభం

కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లబ్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితిలో అభివృద్ధి సాధిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News