Home Latest News Niramala Sitharaman | బడ్జెట్‌లో ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్‌ రికార్డులు ఇవే.. ఈసారి మాత్రం కాస్త...

Niramala Sitharaman | బడ్జెట్‌లో ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్‌ రికార్డులు ఇవే.. ఈసారి మాత్రం కాస్త స్పెషల్‌ !

Image Source : Wikipedia

Niramala Sitharaman | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో బడ్జెట్‌ ( Union Budget 2023-24 ) ప్రవేశపెట్టారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఇదోసారి. దీంతో అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. గత నాలుగేళ్లుగా బడ్జెట్‌ ప్రసంగం చేస్తున్న నిర్మలా సీతారామన్‌ పలు రికార్డులు క్రియేట్‌ చేశారు.
ఆ రికార్డులు ఏంటో చూద్దాం..

అత్యధిక సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాదు.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా ఈమె ఖాతాలోనే ఉంది.

2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 1970-71లో ఇందిరా గాంధీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళగా రికార్డు ఉంది. కానీ ఇందిరాగాంధీ అప్పుడు తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఘనత కూడా నిర్మలా సీతారామన్‌పైనే ఉంది. 2003-04లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన జశ్వంత్‌ సింగ్‌ 135 నిమిషాలు పాటు ప్రసంగం చేశారు. ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ నిర్మలా సీతారామన్‌ 2019-20 బడ్జెట్‌ సమయంలో 137 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.

ఇక 2020-21లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో ఆమె 162 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒంట్లో నలతగా ఉండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించేశారు. ఇప్పటివరకు ఉన్న బడ్జెట్‌ చరిత్రలో ఇదే సుదీర్ఘ ప్రసంగం.

ఈ లెక్కన చూసుకుంటే ఈ సారి చేసిన బడ్జెట్‌ (2023-24) ప్రసంగమే అత్యంత తక్కువ సమయం కొనసాగింది. కేవలం 86 నిమిషాలు మాత్రమే ప్రసంగించింది. ఇప్పటివరకు నిర్మలా సీతారామన్‌ చేసిన ఐదు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Income Tax Slabs Budget 2023 | బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి రూ. 7లక్షలకు పెంపు

Union Budget 2023 | బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ హైలెట్స్ ఇవే..

Union Budget 2023 | ఈసారి కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో వీరిదే కీలక పాత్ర..

Union Budget 2023 | కేంద్ర బడ్జెట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా

Fire Accident | అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

Exit mobile version