Home News International Zelensky | రష్యాకు మద్దతిస్తే ప్రపంచ యుద్ధమే.. చైనాను హెచ్చరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Zelensky | రష్యాకు మద్దతిస్తే ప్రపంచ యుద్ధమే.. చైనాను హెచ్చరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Zelensky | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించి వెళ్లిన తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చైనాను హెచ్చరించారు. తమ దేశానికి వ్యతిరేకంగా రష్యాకు మద్దతు ప్రకటిస్తే అది వరల్డ్ వార్‌కు దారి తీసేందుకు కారణం అవుతుందని స్పష్టం చేశారు. చైనా తీసుకునే నిర్ణయాలపైనే ప్రపంచ యుద్ధం వస్తుందా? లేదా? అనేది ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు. రష్యాకు చైనా మద్దతు తెలపకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ యుద్ధంలో చైనా తమ పక్షాన నిలబడాలని కోరుకుంటున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. అయితే అది సాద్యంక కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో ఏం జరుగుతుందన్న విషయంలో చైనా ఆచరణాత్మక విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. రష్యాతో జట్టుకడితే ప్రపంచ యుద్ధం వస్తుందనే విషయం చైనాకు కూడా తెలుసని ఆయన స్పష్టం చేశారు. ఇక మాల్డోవా రక్షణకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జెలెన్ స్కీ వెల్లడించారు. మాల్డోవాకు సంబంధించిన తమకు అందిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఆ దేశ అధ్యక్షురాలు మైయ సంధుకు అందజేసినట్లు వివరించారు. అక్కడ రష్యా అనుకూల వర్గాలు తిరుగుబాటుకు యత్నిస్తున్నాయని తెలిపారు.

ఉక్రెయిన్‌పై యుద్దంలో రష్యాకు మద్దతుగా బీజింగ్ నుంచి మాస్కోకు ఆయుధాలు వెళ్తాయని అమెరికా ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మ్యూనిక్ రక్షణ సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. చైనా దౌత్యవేత్త వాంగ్‌ యీని హెచ్చరించారు. చైనా నుంచి రష్యాకు ఆయుధాలు అందజేసిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చైనాను జెలెన్‌స్కీ హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Exit mobile version