Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsInternationalZelensky | పుతిన్‌ను ఆయన అంతరంగికులే హత్య చేస్తారు.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

Zelensky | పుతిన్‌ను ఆయన అంతరంగికులే హత్య చేస్తారు.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

Zelensky | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆయన అంతరంగికులే ఏదో ఒక రోజున హతమారుస్తారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ జోస్యం చెప్పారు. పుతిన్ నాయకత్వంపై ‘తిరుగుబాటు’ కాలం వస్తుందని, ఆయన అత్యంత సన్నిహితులే ఆయనపై తిరగబడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇయర్ పేరిట రూపొందించిన ఉక్రెనియన్ డాక్యుమెంటరీలో భాగంగా జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు న్యూస్ వీక్ పత్రిక వెల్లడించింది.

ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 24 న ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. పుతిన్ సన్నిహితులు ఏదో ఒక కారణంపై ఆయన మట్టుబెట్టడం ఖాయమని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తను అన్న మాటలను ఆనాడు వాళ్లు గుర్తుకు తెచ్చుకుంటారని అన్నారు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో మాత్రం స్పష్టంగా చెప్పలేనని తెలిపారు.

యుద్ధం ముగింపు దశకు వచ్చిందనడానికి క్రిమియాను రష్యా నుంచి తాము తిరిగి స్వాధీనం చేసుకోవడమే నిదర్శనమని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఇది తమ భూభాగమని.. ఇక్కడి ప్రజలు తమ వారని.. ఇది తమ చరిత్ర అని తెలిపారు. క్రిమియాలోని ప్రతి చోట తమ జాతీయ పతకాలను ఎగురవేస్తామని ప్రకటించారు.

పుతిన్ సన్నిహిత వర్గంలో నిరాశ నిస్పృహలు ఆవరించాయని, వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని రష్యా నుంచి వచ్చిన వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనబడుతోందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వార్ జరుగుతుండగా అనేకమంది రష్యన్ సైనికులు బిగ్గరగా కేకలు పెడుతూ, రోదిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయని, రష్యన్ సైన్యంలో నానాటికీ ఆందోళన పెరిగిపోతోందనడాన్ని ఇవి రుజువు చేస్తున్నాయని ఈ పత్రిక వెల్లడించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Triangle Love Story | నవీన్‌ను చంపేసి బాడీ పార్ట్స్ బ్యాగులో పట్టుకెళ్లాడు.. లొంగిపోయే ముందు వాటిని కాల్చేశాడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ వైద్య విద్యార్థిని కేసులో కొత్త ట్విస్ట్

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News