Wednesday, July 24, 2024
- Advertisment -
HomeLatest NewsTriangle Love Story | నవీన్‌ను చంపేసి బాడీ పార్ట్స్ బ్యాగులో పట్టుకెళ్లాడు.. లొంగిపోయే ముందు...

Triangle Love Story | నవీన్‌ను చంపేసి బాడీ పార్ట్స్ బ్యాగులో పట్టుకెళ్లాడు.. లొంగిపోయే ముందు వాటిని కాల్చేశాడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

Triangle Love Story | పెద్ద అంబర్‌పేట, టైమ్2న్యూస్ : ప్రేమించిన యువతి దక్కదేమోనన్న భయంతో ప్రాణ స్నేహితుడినే చంపేసిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఛాతిలో నుంచి గుండె పెరికి.. చేతి వేళ్లు నరికి.. మర్మాంగం కోసేసి.. ఇంత క్రూరంగా నవీన్‌ను హరిహరకృష్ణ పింది ఆవేశంలో కాదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అది ఆవేశంతో చేసిన హత్య కాదని.. మూడు నెలల పాటు ఆలోచించి పక్కా పథకం ప్రకారం చంపేశాడు. హత్య ఎలా చేయాలి? సాక్ష్యాధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకునేందుకు పలు క్రైమ్ సిరీస్‌లు చూశాడు. అంతేకాదు హత్య చేయడానికి అనువైన ప్రాంతం కోసం చాలాసార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. అంతెందుకు పోలీసులకు లొంగిపోయే ముందు కూడా ఆధారాలు దొరక్కుండా కాల్ డేటా, వాట్సాప్ చాట్ డిలీట్ చేశాడు. ఈ విషయాలు అన్నింటినీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా స్నేహితుడిని చంపాననే పశ్చాత్తాపం హరిహరకృష్ణలో లేదని.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

ఎలా మొదలైంది?

హరిహరకృష్ణ ముసారాంబాగ్‌లో ఉంటూ దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ కాలేజీలో ఇంటర్ చదివాడు. నవీన్ అక్కడే పరిచయమయ్యాడు. అదే సమయంలో నవీన్‌కు నిహారిక అనే అమ్మాయి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ అయిపోయిన తర్వాత నవీన్.. నార్కట్‌పల్లిలోని మహాత్మాగాంధీ వర్సిటీలో ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. హరిహరకృష్ణ ఫిర్జాదిగూడలోని అరోరా కాలేజీలో చేరాడు. బీటెక్‌లో చేరిన తర్వాత నవీన్ వేరే అమ్మాయిలతో కూడా చనువుగా ఉండటం చూసి నిహారిక అతన్ని దూరం పెట్టింది. ఇదే అదునుగా హరిహరకృష్ణ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. అలా 9 నెలలు గడిచిన తర్వాత వాళ్లిద్దరూ దగ్గరవ్వడం చూసి నవీన్ మళ్లీ అమ్మాయితో మాటలు కలిపాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో హరిహరకృష్ణలో అభ్రదతాభావం పెరిగిపోయింది. నవీన్ ఉంటే ఆ యువతి తనకు దక్కదని భావించాడు. దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

3 నెలల క్రితమే ప్లాన్

నవీన్‌ అడ్డు తొలగించుకోవాలని హరిహరకృష్ణ మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నాడు. రెండు నెలల క్రితం మలక్‌పేటలోని ఓ సూపర్ మార్కెట్‌లో కత్తి కూడా కొనుగోలు చేశాడు. వేలిముద్రలు దొరక్కుండా ఓ మెడికల్ షాపులో రెండు జతల గ్లౌజులు కొన్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్ ఏరియాలో నవీన్‌ను హత్య చేయడానికి సరైన ప్లేస్ కోసం దాదాపు 8సార్లు రెక్కీ నిర్వహించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా మంచి స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 16న ఇంటర్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అదే రోజు నవీన్‌ను హత్య చేయాలని హరిహరకృష్ణ స్కెచ్ వేశాడు. కానీ ఆ రోజు నవీన్ రాకపోవడంతో తప్పించుకున్నాడు.

కలిసొచ్చిన అదృష్టం

మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హరిహరకృష్ణకు నవీన్ ఫోన్ చేసి తనను కలవడానికి వస్తున్నా అని చెప్పాడు. ఇదే అదునుగా భావించి ముందు రోజు ఫెయిల్ అయిన ప్లాన్‌ను ఆ రోజు అమలు చేయాలని హరిహర కృష్ణ నిర్ణయించుకున్నాడు. ఎల్బీనగర్‌లో నవీన్ దిగగానే అతన్ని తీసుకుని ముసారాంబాగ్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అయ్యాక తాను మళ్లీ యూనివర్సిటీ హాస్టల్‌కు వెళ్లిపోవాలని నవీన్ చెప్పాడు. అందుకు సరే అన్న హరిహరకృష్ణ తానే దింపుతానని అన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో నవీన్‌ను బైక్‌పై ఎక్కించుకుని బయల్దేరాడు. అప్పటికే కొని పెట్టుకున్న కత్తి, గ్లౌజులను బ్యాగులో పెట్టుకుని నవీన్‌ను తీసుకుని బైక్‌పై హరిహరకృష్ణ అతని హాస్టల్‌కు బయల్దేరాడు. పెద్ద అంబర్‌పేట వైన్స్ దగ్గర మందు తాగారు. అక్కడే హరిహరకృష్ణ ఫోన్ నుంచి నవీన్ తాను ప్రేమించిన యువతికి ఫోన్ చేసిన మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరారు.

నమ్మించి హత్య

అప్పటికే రాత్రి 11 గంటల సమయం అవుతోంది. పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు దాటగానే యూనివర్సిటీకి వెళ్లడానికి లేట్ అవుతుందని.. రేపు వెళ్లొచ్చులే అని నవీన్‌ను హరిహరకృష్ణ ఒప్పించాడు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర బైక్ యూటర్న్ తీసుకుని ఎల్బీ నగర్ వైపు బయల్దేరాడు. మధ్యలో తాను ప్రేమించిన యువతి ప్రస్తావన తెచ్చాడు. మాటల మధ్యలో రోడ్డు పక్కనుంచి పొదల్లోకి బైక్‌ను పోనిచ్చాడు. సదరు యువతి కోసం అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే నవీన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ముందుగానే కొనుక్కున్న గ్లౌజులు ధరించిన నవీన్ తల నరికేశాడు. బట్టలు చింపేసి గుండెను పెరికి బయటకు తీశాడు. మర్మాంగాన్ని కట్ చేశాడు. విక్రమ్ సినిమా స్ఫూర్తితో చనిపోయింది ఎవరో గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లను కోసేశాడు.

బ్యాగ్‌లోనే నవీన్ బాడీ పార్ట్స్

తల, కత్తితోపాటు నవీన్ బాడీ పార్ట్స్‌ను బ్యాగులో వేసుకుని బ్రాహ్మణపల్లి వెళ్లే దారిలో పడేశాడు. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలోని హాసన్ ఇంటికి వెళ్లి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను తీసేసి స్నానం చేశాడు. హాసన్‌కు నవీన్‌ను హత్య చేసినట్లు చెప్పగా.. పోలీసులకు లొంగిపోమని సూచించాడు. తెల్లారి పోలీసులకు చెబుతానని చెప్పి అక్కడి నుంచి బయల్దేరాడు. రక్తపు మరకలు ఉన్న బట్టలను సాగర్ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ చెత్తకుండీలో విసిరేశాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లిపోయాడు. 18వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో యువతికి నవీన్ హత్య గురించి చెప్పాడు. భయాందోళనకు గురైన ఆమె హరిపై కోప్పడింది.

ఆరు రోజుల తర్వాత మళ్లీ హత్య చేసిన చోటుకే

ఆ తర్వాత హరిహరకృష్ణ వరంగల్‌లోని తండ్రి దగ్గరకు వెళ్లాడు. నవీన్ మిస్సింగ్ అయినట్లు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో భయపడిన హరిహరకృష్ణ ఈ నెల 21వ తేదీన బైక్‌పై కోదాడ వెళ్లాడు. అక్కడి నుంచి ఆరు రోజుల పాటు బస్సులో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో తిరిగాడు. ఇలా తప్పించుకుని తిరిగితే కాల్చి చంపేస్తారనే భయంతో 23వ తేదీ రాత్రి వరంగల్‌కు తిరిగొచ్చి తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి బ్రాహ్మణపల్లిలో పడేసిన శరీరభాగాలను సేకరించి హత్య చేసిన స్థలంలో వాటిని పడేశాడు. ఆధారాలు దొరక్కుండా బ్యాగ్‌ను కాల్చేశాడు. 24వ తేదీ సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ వైద్య విద్యార్థిని కేసులో కొత్త ట్విస్ట్

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News