Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (01-03-2022)

Horoscope Today | రాశిఫలాలు (01-03-2022)

Horoscope Today | మేషం

రక్త సంబంధీకులు దాయదుల వల్ల సహాయం లభిస్తుంది. కార్యాలయంలో అధికారుల మందలింపులు తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. గతంలో మీరిచ్చిన రుణాలు వసూలవుతాయి.

వృషభం

స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన వార్త వింటారు. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. మీరు చెప్పిన పనికి ఎదుటి వారి నుంచి ప్రతిస్పందన బాగుంటుంది.

మిథునం

ప్రకటనలు, మీడియాకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఇరుగుపొరుగు వారితో వివాదాలు తప్పకపోవచ్చు. నిదానమే ప్రధానం అన్న సూక్తిని గుర్తుపెట్టుకోండి

కర్కాటకం

దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో ఎన్నో పనులను సానుకూలపరచుకుంటారు. మంచి రోజులు వచ్చినట్లుగా తోస్తుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

సింహం

శారీరక రుగ్మత మానసిక కష్టానికి కారణం అవుతుంది. అకారణ కలహాలను ఆదిలోనే తుంచి వేయండి. మీ శక్తికి మించి ఒకానొక వ్యక్తిని ఆదుకుంటారు. ఊరట చెందుతారు.

కన్య

ఉచిత సలహాలు ఇచ్చేవారు తారసపడతారు. స్థాయి తక్కువ వ్యక్తులతో పోరాడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు సంపూర్ణంగా అందుకుంటారు.

తుల

పట్టుదలతో శ్రమిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ఓర్పు కనబరుస్తారు. స్థిరాస్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వృశ్చికం

చేసిన చిన్న సహాయాన్ని భూతద్దంలో చూపించే సన్నిహితులు అధికమవుతారు. సాంకేతిక విద్య ఆధారంగా చేసే ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పొదుపు పాటిస్తారు.

ధనుస్సు

జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సాధించడానికి చేసే శ్రమ ఫలిస్తుంది. నిష్కారణమైన విమర్శలు, అపవాదాలు తప్పకపోవచ్చు.

మకరం

డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉన్నట్లు తోస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నిష్కారణ భయం వేధిస్తుంద.ి

కుంభం

ఎంతోకాలంగా మీలో ఉన్న ఒక కోరిక నెరవేరుతుంది. చెల్లించాల్సిన డబ్బుపై ఒత్తిడి అధికమవుతుంది. మధ్యవర్తిగా ఉండి మాట్లాడేదానికన్నా మాట్లాడకపోవడం మంచిది.

మీనం

జమాఖర్చులు పరిశీలించుకుంటారు. తల్లి తరఫఉ బంధువులకు సహాయం అందిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News