Monday, April 15, 2024
- Advertisment -
HomeNewsAPTTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్...

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

TTD | తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం.. ఆర్జిత సేవా టికెట్లు.. తిరుమలలో రూమ్స్.. అన్నింటి సమాచారం ఇప్పుడు అరచేతిలోనే చూడవచ్చు. మనకు నచ్చిన టైమ్ స్లాట్‌లో వాటిని బుకింగ్ కూడా చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఒక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఇదివరకే ఉన్న గోవింద యాప్‌నే అప్‌డేట్ చేసి.. టీటీ దేవస్థానమ్స్ పేరుతో సరికొత్తగా భక్తులకు అందుబాటులో ఉంచింది.

ఈ టీటీ దేవస్థానమ్స్ యాప్‌ ను టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిసి ప్రారంభించారు. జియో వారి సహకారంతో ఈ కొత్త యాప్‌ ను రూపొందించినట్లు వారు తెలిపారు. . శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలతో పాటు తిరుమలకు సంబంధించిన సమాచారమంతా కూడా ఈ యాప్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా తిరుమల దేవస్థానానికి విరాళాలు కూడా అందజేయవచ్చు.

దేవస్థానానికి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట ఉండేలా ఈ యాప్‌ ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు దర్శన టికెట్లను కేవలం ఆన్‌ లైన్‌ వెబ్‌ సైట్‌ ద్వారా బుక్‌ చేసుకునే వారు. ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చిన యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారి సేవా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా కూడా ఈ యాప్‌ ని రూపొందించారు. ఏది ఏమైతేనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాప్‌ రూపొందించడం జరిగింది.

గతంలో దేవస్థానానికి సంబంధించిన గోవింద యాప్‌ ఉండగా… దానిలో పలు సమస్యలు తలెత్తాయి. శ్రీవారి దర్శనం టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఎదురయ్యాయి. అందుకే దాని స్థానంలో కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. జియో ప్లాట్‌ఫామ్ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. గతంలో ప్రయోగాత్మకంగా జియో క్లౌడ్‌ టెక్నాలజీ ద్వారా ఆన్‌ లైన్‌ టికెట్లు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా గంట సమయం లోపే టికెట్లు బుక్‌ చేసుకోగలిగారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Srinivasa Murthy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగం సినిమాలో సూర్యకు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి హఠాన్మరణం

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News