Vishnu Priya | ఈటీవీలో ప్రసారమైన పోవే పోరాతో గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ భీమినేని. ఆ షో తర్వాత మల్లెమాల నిర్వహించే పలు షోల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల రీతూ చౌదరితో కలిసి బ్యాంకాక్ ట్రిప్ ఎంజాయ్ చేసొచ్చిన విష్ణుప్రియ ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి కన్నుమూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విష్ణుప్రియ తెలియజేసింది.
మై డియర్ లవ్లీ మమ్మీ… ఈ రోజు వరకు నువ్వు నా పక్కన ఉన్నందుకు చాలా థాంక్స్. నువ్వు ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్లిపోయి ఉండవచ్చు కానీ… నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు. మాకు మంచి జీవితాన్ని కల్పించడానికి నువ్వు ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చావు. అందుకు నీకు చాలా రుణపడి ఉంటాం. నువ్వే నా బలం… నువ్వే నా బలహీనత. నా చివరి శ్వాస వరకు నిన్ను ఆరాధిస్తూ, ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటి నుంచి నీ ముద్దలను మిస్ అవుతాను అమ్మా అంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులతో పాటు తోటి నటీనటులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

బుల్లితెర కంటే ముందే వెండితెరపైకి అరంగేట్రం చేసింది విష్ణు ప్రియ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మెప్పించింది. కానీ అక్కడ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకు వచ్చి సెటిలయ్యింది. ఇక్కడ ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా షోతో పాపులారిటీ తెచ్చుకుంది. అప్పట్నుంచి మల్లెమాల నిర్వహించే పలు టీవీ షోల్లో సందడి చేస్తూనే ఉంది. ఇటీవల తన తోటి బుల్లితెర నటి రీతూ చౌదరితో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్లొచ్చింది. హాలీ డే ఎంజాయ్ చేసి వచ్చిన వారంలోపే రీతూ చౌదరి వాళ్ల నాన్న మరణించాడు. ఇప్పుడు విష్ణు ప్రియ తల్లి కూడా చనిపోవడం ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత
Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత
Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్