Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentUorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ...

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Uorfi Javed | ఎప్పుడూ తను వేసుకునే బట్టలతో వివాదాల్లో నిలిచే ఉర్ఫీ జావెద్‌కు కొత్త సమస్య వచ్చి పడింది. ఈమె వేసుకునే డ్రెస్సులు చూసి ఇల్లు కిరాయికి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ముంబై మహానగరంలో ఎంత తిరిగినా తనకు ఇంటిని రెంట్‌కు ఇచ్చే నాథుడే దొరకడం లేదని ఇప్పుడు ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ విచారం వ్యక్తం చేస్తుంది. తన ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెప్పింది.

నా డ్రెస్సులను చూసి ముస్లిం యజమానులు నాకు ఇల్లు కిరాయికి ఇవ్వాలని అనుకోవట్లేదు. నేను ముస్లిం కాబట్టి హిందీ యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వలేమని అంటున్నారు. కొందరేమో నాకు వస్తున్న పొలిటికల్‌ బెదిరింపులకు భయపడి ఇల్లు రెంట్‌కు ఇవ్వట్లేదు. ఇలా ఎవరూ ముందుకు రావడంతో నాకు ముంబైలో ఇల్లు దొరకడం చాలా కష్టమైపోయింది అంటూ ట్విట్టర్‌ ద్వారా తన బాధను వెల్లగక్కింది. ఉర్ఫీ జావెద్‌ చేసిన పోస్టును చూసిన ఓ నెటిజన్‌.. నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నా.. వీలైనంత తొందరగా మీకు మంచి ఇల్లు దొరకాలని ఆశిస్తున్నా అంటూ కామెంట్‌ చేసింది. ఈ కామెంట్‌కు ఉర్ఫీ స్పందించింది. నాలాంటి సింగిల్స్‌కు, ముస్లింలకు, నటులకు ఇల్లు దొరకడం అసాధ్యమేనదే అంటూ బదులిచ్చింది. ఈ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హిందీ సీరియల్స్‌లో ఉర్ఫీ జావెద్‌ ఇండస్ట్రీలోకి వచ్చింది. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. 2021లో బిగ్‌బాస్‌ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. అప్పట్నుంచి విభిన్న, అశ్లీల దుస్తులు ధరిస్తూ పాపులర్‌ అయ్యింది. కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా మారాయి. పలువురు రాజకీయ నాయకులు ఉర్ఫీ జావెద్‌పై ఫిర్యాదు కూడా చేశారు. ఉర్ఫీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూసి పలువురు చంపేస్తామని బెదిరించారు కూడా.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News