Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsAPBalakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Balakrishna | వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో.. ఇలా దిగ్గజ నటుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని చాలామంది తప్పుబడుతున్నారు. దీనిపై అక్కినేని వారసులు కూడా స్పందించారు. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు .. వారిని అగౌరవ పరచడం మనల్ని మనమే కించపరచుకోవడం అని అక్కినేని నాగచైతన్య, అఖిల్ పేర్కొన్నారు. దీంతో బాలయ్య వ్యాఖ్యలు నందమూరి వర్సెస్ అక్కినేనిగా మారుతుందేమోనని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. బాలయ్య క్షమాపణలు చెబుతాడా? లేదా ఈ వివాదం మరింత ముదురుతుందా? అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ స్పందించాడు.

అక్కినేని.. తొక్కినేని అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కదా అని మీడియా అడగ్గా.. ఏయన్నార్‌ను కించపరచాలనే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని బాలకృష్ణ స్పష్టం చేశాడు. రామారావును ఎన్టీవోడు అని.. నాగేశ్వరరావును నాగిగాడు అని.. ఇలా ఒక్కోచోట ఒక్కొకరు అభిమానంతో పిలుస్తుంటారు. అలా అని వాళ్లపై గౌరవం లేదని కాదు.. అది కేవలం అభిమానమేనని స్పష్టం చేశాడు. తాడో పేడో అని అంటారు కదా.. పేడో అంటే ఏంటి? అని ప్రశ్నించాడు. అవకాశం దొరికింది కదా అని తనపై ఆరోపణలు చేస్తున్నారని.. అసలు విషయం ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.

ఏయన్నార్ తనకు బాబాయ్ లాంటి వాడు అని బాలకృష్ణ పేర్కొన్నాడు. సొంత పిల్లల కంటే కూడా తనను ఆప్యాయంగా చూసుకునే వాడని స్పష్టం చేశాడు. ఇక్కడ ఆప్యాయత ఉంది.. అక్కడ లేదు గుర్తుపెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించాడు. నాగేశ్వరరావు అంటే తనకు ఎప్పటికీ అభిమానం ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండస్ట్రీకి ఇద్దరే కళ్లు అని చెప్పాడు. నాన్నగారు ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా.. నాగేశ్వరరావు దగ్గర నుంచి పొగడ్తలకు దూరంగా ఉండాలనే విషయం నేర్చుకున్నానని తెలిపాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Ritu Chowdary | ఫొటో దిగినప్పుడు అనుకోలేదు.. ఇదే చివరి ఫొటో అవుతుందని.. కన్నీళ్లు పెట్టిస్తున్న రీతూ చౌదరి పోస్టు

Vijay Antony | నేను క్షేమంగానే ఉన్నా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచే అప్‌డేట్ ఇచ్చిన బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News