Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTSRTC | రూ.300కే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ చుట్టేయండి.. టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్

TSRTC | రూ.300కే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌ చుట్టేయండి.. టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్

TSRTC | ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని పెంచుకునేందుకు రెండు ఆఫర్లను ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రయాణించే వారికోసం టీ -6, ఎఫ్‌-24 ఆఫర్లను తీసుకొచ్చారు. ఈ మేరకు ఆఫర్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఇప్పటికే అమలవుతున్న టీ-24 టికెట్‌ మాదిరిగానే వీటిని కూడా ఆదరించాలని ప్రయాణికులను ఈ సందర్భంగా ఆయన కోరారు.

హైదరాబాద్ నగరంలో గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించిందని సజ్జనార్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టిక్కెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. దీనికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు, పర్యాటకులకు ఆర్టీసీని మరింత చేరువ చేసేందుకు టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ ప్రారంభించిందని తెలిపారు.

టీ-6 టికెట్ ఆఫర్‌ విషయానికొస్తే.. ఇది మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ.50గా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆరు గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణించే వారికి మాత్రమే ఇది వర్తించనుంది.

ఎఫ్-24 విషయానికి వస్తే ఇది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. దీని ధర రూ.300గా నిర్ణయించారు. ఈ టికెట్‌ ద్వారా హైదరాబాద్‌ సబర్బన్‌ పరిమితుల్లో నలుగురు వ్యక్తులు 24 గంటల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ టికెట్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి 24 గంటల వరకు వర్తిస్తుంది. సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇక, ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24 టికెట్‌ను ఆర్టీసీ సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్ ధర పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 60గా ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News