Home Latest News TSPSC Leaks | టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. ఒకటి కాదు 5 పేపర్లు కొట్టేసిన...

TSPSC Leaks | టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. ఒకటి కాదు 5 పేపర్లు కొట్టేసిన ప్రవీణ్‌!

TSPSC Leaks | తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సిట్‌ అనేక కోణాల్లో వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడు ప్రవీణ్‌ మొత్తంగా ఐదు పేపర్లను కంప్యూటర్‌ నుంచి ప్రవీణ్‌ కొట్టేసినట్లు సిట్ అధికారులు కనిపెట్టారు. టీఎస్పీఎస్సీ అధికారులతో భేటీ అయిన సిట్ చీఫ్ అనేక విష‌యాల‌ను విచారించారు.

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ లక్ష్మి దగ్గర నుంచి పాస్వర్డ్ ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కి లబ్ధి చేకూర్చేందుకు కంప్యూటర్ లాన్ లో టీఎస్పీఎస్సీ ఉద్యోగి రాజశేఖర్.. పలు మార్పులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.

రాజశేఖర్ సహాయంతో ప్రవీణ్ పేప‌ర్ల‌ను కొట్టేసిన‌ట్లు నిర్ధారించారు. తన‌ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ప్రవీణ్ పేపర్లను సేవ్ చేసుకున్నట్లు సిట్ అధికారులు తేల్చారు.

5వ తేదీన జరిగిన ఏఈ ఎగ్జామ్ పేపర్ తో పాటు మరికొన్ని పేపర్లను ప్రవీణ్ కొట్టేసినట్లు గుర్తించారు. 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్లను కూడా ప్రవీణ్ కొట్టేసినట్లు అధికారులు గుర్తించారు.

త్వరలో జరిగబోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను ప్రవీణ్ తన దగ్గర పెట్టుకున్నట్లు సిట్ అధికారులు క‌నుగొన్నారు. సమయం చూసి పేపర్లను విక్రయించాలని ప్రవీణ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో జరగబోయే పేపర్లు అన్ని ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో రాయబోయే అభ్యర్థులను వెతికి బేరం మాట్లాడి పెట్టాలని రేణుకకు ప్ర‌వీణ్ చెప్పిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version