Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsTSPSC Leaks | గ్రూప్ -1 పరీక్షలో ప్రవీణ్ కావాలనే డిస్‌క్వాలిఫై చేసుకున్నాడా.. పేపర్ లీక్...

TSPSC Leaks | గ్రూప్ -1 పరీక్షలో ప్రవీణ్ కావాలనే డిస్‌క్వాలిఫై చేసుకున్నాడా.. పేపర్ లీక్ నిందితుల వ్యూహాత్మక ఎత్తుగడలు!

TSPSC Leaks | టీఎస్పీఎస్సీ లీక్ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ చాలా వ్యూహాత్మకంగా వ్యహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రవీణ్, రేణుకను అదుపులోకి తీసుకున్న తర్వాత తాము చేసిన నేరాలను పక్క దారి పట్టించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.

టీఎస్పీఎస్సీలో పనిచేసే 20 మంది గ్రూప్-1 రాసినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. వీరిలో 8 మంది క్వాలిఫై అయ్యారని తెలిపారు. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కావాలనే తన ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నంబర్‌ను డబుల్ బబ్లింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా వాళ్లు కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు భావిస్తున్నారు. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కండ్లు తమపైనే పడతాయని, దొరికిపోతామని భావించి మార్కులు తక్కువ వచ్చేలా పథకం ప్రకారం నడుచుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

పేపర్ లీకేజీ తర్వాత 150 కి 150 మార్కులు వచ్చే అవకాశం ఉన్నా.. జాగ్రత్తగా కొంచెం మార్కులు తక్కువ వచ్చేలా జాగ్రత్త పడ్డారు నిందితులు. కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరికైనా వంద శాతం లేకా అసాధారణ స్థాయిలో మార్కులు వస్తే వారిపై విచారణ చేపడతారు. పోలీసులతోనూ దర్యాప్తు చేపించడం ఆనవాయితీ. ఈ విషయం తెలిసే నిందితులు జాగ్రత్త పడ్డారని పోలీసులు గుర్తించారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ క్వాలిఫై అయిన షమీమ్‌కు అత్యధికంగా 127 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సురేశ్, రమేశ్ కు కూడా వందకు పైగా మార్కులు వచ్చినట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ ముగ్గురూ ప్రవీణ్, రాజశేఖర్ నుంచి ప్రశ్న పత్రం ముందస్తుగానే పొందారన్న ఆరోపణలపై ఇప్పటికే వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

ముందుగా ప్రవీణ్, రేణుకను అరెస్టు చేసినప్పుడు తాము ఏఈ ప్రశ్న పత్రం మాత్రమే లీక్ చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రూప్ 1 తో పాటు మిగతా పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయన్న విషయం బయట పడకుండా నిందితులు కొంత తప్పు ఒప్పుకొనే ప్రయత్నం చేశారు. తమను పట్టుకున్న వెంటనే సిట్ అధికారులు ముందు ఒప్పుకుంటే అక్కడితో ఆగిపోతారని భావించారు. కానీ సిట్ అధికారులు మాత్రం అంతటితో ఆగలేదు. గ్రూప్-1తో పాటు మరో మూడు ప్రశ్న పత్రాలను వీరు లీక్ చేసినట్లు గుర్తించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | సారీ చెప్పేందుకు సావర్కర్‌ని కాదు.. ఎంపీగా అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి

Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News