Home Entertainment Godfather | మీడియాను అనాల్సింది అని.. ఆయింట్మెంట్ రాసిన మెగాస్టార్ చిరంజీవి..!

Godfather | మీడియాను అనాల్సింది అని.. ఆయింట్మెంట్ రాసిన మెగాస్టార్ చిరంజీవి..!

Godfather | సాధారణంగా మీడియా ముందు చిరంజీవి చాలా కామ్ గా ఉంటాడు.. ఎలాంటి నోరూ జారడు.. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకడు.. ఎంత టఫ్ సిట్యుయేషన్స్ ఎదురైనా కూడా తనను తాను కంట్రోల్ చేసుకొని మీడియా ముందు చాలా పద్ధతిగా కనిపిస్తాడు చిరంజీవి. మొన్నటికి మొన్న గరికపాటి నరసింహారావు విషయంలోనూ తప్పు మొత్తం అవతలి పైకి ఉండేలా జాగ్రత్త పడ్డాడు మెగాస్టార్. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మాత్రం మీడియాను ఓ రేంజ్ లో ఉతికి ఆరేసాడు చిరంజీవి. అనాల్సింది అన్ని అని చివరికి ఆయింట్మెంట్ రాశాడు ఈయన. ఆచార్య సినిమా సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని మైండ్ లో పెట్టుకున్నాడు మెగాస్టార్.

అప్పుడు మీడియాలో తనపై వచ్చిన కథనాలతో పాటు సినిమాను చీల్చి చెండాడిన తీరు కూడా ఆయన బాగా బుర్రలో పెట్టుకున్నాడు. ఇక గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ విషయంలోనూ ఈయన హర్ట్ అయ్యాడు. ఇదే విషయంపై మాట్లాడుతూ.. మీడియా అతిత్సాహం ప్రదర్శించింది.. మేమేం చేయాలో కూడా మీరే చెప్తే ఇక మేము ఎందుకు చేయడం అంటూ మీడియాని ఎత్తి చూపించే ప్రయత్నం చేశాడు చిరంజీవి.

ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తున్నప్పుడు ప్రమోషన్ ఎలా చేసుకోవాలో మాకు తెలియదా.. అది కూడా మీరు చెప్పాలా మేమేం చేయాలో కూడా మీడియా డిసైడ్ చేస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉంది అంటూ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో కాస్త ఓవర్ గానే రియాక్ట్ అయ్యాడు చిరంజీవి.

ఇక్కడితో ఆగిపోలేదు అనంతపురంలో జరిగిన ఈవెంట్ కు వర్షం పడితే.. అక్కడ నుంచి కామ్ గా లేచి వెళ్ళిపోతే మీడియా ఎక్కడా పెంట పెంట చేస్తుందో అనే భయంతోనే.. తాను అంత వర్షంలో కూడా మాట్లాడానని.. అంతే తప్ప అందులో ఎలాంటి స్పీచ్ ప్రిపేర్ కాలేదు అని చెప్పాడు చిరంజీవి. మీడియాను ముందు ఉతికి ఆరేసిన ఈయన.. చివర్లో గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన తర్వాత అదే మీడియా తన నెత్తిన పెట్టుకొని చూసుకుందని.. సినిమాను వాళ్ళ సొంత సినిమాలో ప్రమోట్ చేసిందని.. ప్రతి ఒక్కరు అద్భుతమైన రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు అంటూ ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా ఒకే వేదికపై చిరంజీవి రెండు కోణాలు చూపించాడు. తన కత్తికి రెండు వైపులా పదునే అన్నట్టు ఒక వైపు తిడుతూ మరోవైపు ప్రశంసలతో ముంచేసాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం?

Mulayam singh yadav | ఆ రెజ్లింగ్‌ టోర్నీ ములాయం సింగ్ యాదవ్ దశాదిశను మార్చేసింది. . లేదంటే రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదా?

Filmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు అవార్డులు

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Exit mobile version