Home Business Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.....

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం?

Digital Rupee | త్వరలోనే డిజిటల్‌ రూపాయిని విడుదల చేయనున్నట్లు RBI ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఇప్పడు అందరి ఫోకస్‌ డిజిటల్‌ రూపాయి మీద పడింది. ఇంతకీ డిజిటల్ రూపాయి ఏంటి.. అదెలా పనిచేస్తుంది.. ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు సురక్షితం అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే డిజిటల్‌ రూపాయి మార్కెట్లోకి రాకముందే దీని గురించి తెలుసుకోండి మరి..

అసలేంటి డిజిటల్‌ రూపాయి ?

డిజిటల్‌ రూపాయి.. ఇప్పుడున్న కరెన్సీల్లానే పనిచేస్తుంది. కానీ ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉంటుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకు ఆర్‌బీఐ డిజిటల్‌ రూపాయిని అందుబాటులోకి తీసుకొస్తోంది. డిజిటల్‌ లావాదేవీలు పెంచడం కూడా దీని వెనుక ప్రధాన ఉద్దేశం. డిజిటల్‌ రూపాయి అసలు పేరు CBDC అంటే సెంట్రల్‌ బ్యాంక్ డిజిటల్‌ కరెన్సీ అన్నమాట. ఇంకా చెప్పాలంటే.. ఆర్‌బీఐ తీసుకొచ్చే చట్టబద్ధమైన కరెన్సీ అన్నట్లు. వీటిని ఆర్‌బీఐ నేరుగా జారీ చేసి కంట్రోల్‌ చేస్తుంది. బ్యాంకులు నిర్వహణ చూసుకుంటాయి.

డిజిటల్‌ రూపాయి రెండు రకాలు!

ఆర్‌బీఐ ప్రకారం డిజిటల్‌ రూపాయి రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది. టోకెన్‌ ఆధారిత డిజిటల్‌ రూపాయి, అకౌంట్‌ ఆధారిత డిజిటల్‌ రూపాయి. టోకెన్‌ ఆధారిత రూపాయేమో కరెన్సీ నోట్ల మాదిరిగానే ఉండి.. ఇప్పుడున్న కరెన్సీలానే ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. అకౌంట్‌ ఆధారిత డిజిటల్‌ రూపాయి మాత్రం కొన్ని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది. టోకెన్‌ ఆధారిత డిజిటల్‌ రూపాయిని ఆర్‌బీఐ జారీ చేస్తే బ్యాంకులు పంపిణీ చేస్తాయి.

ఎవరికి ఉపయోగం..

అమెరికా, అరబ్‌ వంటి దేశాల్లో పనిచేసే మనవాళ్లు డిజిటల్‌ రూపాయి సాయంతో తక్కువ ఖర్చుతో స్వదేశంలో ఉండే కుటుంబసభ్యులకు డబ్బులు పంపించుకునే వీలుంటుంది. ఇప్పటికే వందకు పైగా దేశాలు డిజిటల్‌ కరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నాయి. జమైకా, నైజీరియా వంటి దేశాలు తీసుకొచ్చేశాయి కూడా. వచ్చే ఏడాది చైనా కూడా డిజిటల్‌ కరెన్సీ తీసుకొస్తుంది. ప్రభుత్వం జారీ చేసే డిజిటల్‌ కరెన్సీతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇప్పటికే యురోపియన్‌ సెంట్రల్ బ్యాంకు తేల్చి చెప్పింది. కాబట్టి డిజిటల్‌ రూపాయి సురక్షితమే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Mulayam singh yadav | ఆ రెజ్లింగ్‌ టోర్నీ ములాయం సింగ్ యాదవ్ దశాదిశను మార్చేసింది. . లేదంటే రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదా?

Filmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు అవార్డులు

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Exit mobile version