Home Latest News Model School Entrance exam | తెలంగాణలో మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ధరఖాస్తులు ప్రారంభం.. ఏప్రిల్‌...

Model School Entrance exam | తెలంగాణలో మోడల్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ధరఖాస్తులు ప్రారంభం.. ఏప్రిల్‌ 16న ప్రవేశ పరీక్ష

Model School Entrance exam | తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. వచ్చే నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మోడల్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ ఉషారాణి తెలిపారు. మోడల్‌ స్కూల్‌లో ప్రవేశ పరీక్ష కోసం సోమవారమే నోటిఫికిషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 16న అన్ని మండల కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. మే 15న ఫలితాలు వెలువడనున్నాయి. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతితో పాటు 7నుంచి 10వ తరగతిలో ఖాళీ ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 194 మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో 19,400 సీట్లున్నాయి. ఇక 7-10 తరగతుల్లో కొన్నిసీట్లు ఖాళీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ఫీజు జనరల్ విద్యార్థులకు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ విద్య్థార్థులకు రూ.125గా నిర్ణయించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని అధికారులు వెల్లడించారు.

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులుజనవరి 10 నుంచి ఫిబ్రవరి 15 వరకు
హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ఏప్రిల్ 8 నుంచి
పరీక్ష తేదీఏప్రిల్‌ 16
ఫలితాల విడుదల మే 15
పాఠశాలల వారీగా ఎంపికైన జాబితా మే 24
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ మే 25 నుంచి 31 వరకు
తరగతుల ప్రారంభం జూన్‌ 1

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ?

Exit mobile version