Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsDMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు...

DMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

DMHO Srinivasa rao | తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెంలోని ఓ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్నారు. అంతేకాదు ఏసుక్రీస్తు దయవల్లే కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై సోషల్‌ మీడియాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శ్రీనివాస్‌రావును పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

” రెండున్నర సంవత్సరాల నుంచి కొవిడ్‌ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థంగా మార్చింది. మనం అందించిన సేవ వల్ల కరోనా నుంచి బయటపడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది. దేశాభివృద్ధిలో క్రైస్తవ మతం పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం” అంటూ శ్రీనివాస్‌రావు కామెంట్స్‌ చేశారు.

తాజా వ్యాఖ్యలే కాదు గతంలోనూ ఆయన చేసిన పనులు వివాదాస్పదమయ్యాయి. గతంలో క్షుద్రపూజలు చేసిన వీడియోలు కూడా బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 8 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమిషం వ్యవధిలో సీఎం కాళ్లను రెండు సార్లు మొక్కడం కూడా వివాదాస్పదమైంది.

శ్రీనివాస్‌రావు వాదన మరోలా..

తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద కావడంపై శ్రీనివాస్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ” కొన్ని మీడియా సంస్థలు నా ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్‌ చేసి, వివాదాన్ని సృష్టించడం నన్ను తీవ్రంగా కలచివేసింది. కేవలం క్రీస్తు ద్వారానే కరోనా సమసిపోయింది అని నేను అన్నట్లు అర్థం వచ్చేలా వీడియో క్లిప్‌ కట్‌ చేసి ప్లే చేస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా కండిస్తున్నాను” అంటూ ప్రకటన విడుదల చేశారు.

అంతేకాదు..” సీఎం కేసీఆర్ చొరవ, ప్రభుత్వ పనితీరు, ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సంపూర్ణ సహకారం, అన్ని మతాలకు చెందిన వారు, వారి దేవతామూర్తులను ప్రార్థించడం వల్లనే కరోనా సమసిపోయిందని వ్యాఖ్యానించాను. కొందరు దీన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరం. నేను ఏ మతాన్ని, ఎవరిని నమ్మకాలను కించపరచను, అన్ని మతాలను ఒకే రకంగా చూస్తాను, సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతాను దయచేసి యూట్యూబ్‌లో ఉన్న పూర్తి వీడియో చూడాలి” అంటూ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Online Game | ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న రంగారెడ్డి జిల్లా విద్యార్థి.. లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్‌.. కవిత, మాగుంట పేర్లు ప్రస్తావించిన ఈడీ

KTR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Sircilla kidnap | సిరిసిల్ల జిల్లాలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్… మేమిద్దరం ప్రేమించుకున్నాం.. తల్లిదండ్రులతోనే మాకు ప్రాణహాని..

Digvijaya singh on TPPC | తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఫోకస్.. రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News