Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsMancherial | ఎన్టీఆర్ సినిమా చూసి హత్యకు స్కెచ్.. మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం కేసులో ఎన్నో...

Mancherial | ఎన్టీఆర్ సినిమా చూసి హత్యకు స్కెచ్.. మంచిర్యాలలో ఆరుగురి సజీవదహనం కేసులో ఎన్నో ట్విస్టులు

Mancherial | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆరుగురు సజీవదహనం కేసు మిస్టరీ వీడింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతానికి వివాహేతర సంబంధమే కారణమని తేలింది. నాలుగు రోజుల పాటు 16 బృందాలుగా గాలించిన పోలీసులు నిందితులను పట్టుకుని తమదైన శైలిలో విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకొచ్చాయి. శాంతయ్య అనే వ్యక్తి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. ఆస్తి మొత్తం ఆమెకే రాసిస్తాడేమో అన్న అనుమానంతో కట్టుకున్న భార్యే ఈ దారుణానికి ఒడిగట్టింది. అంతకుముందు రెండుసార్లు యాక్సిడెంట్ చేసి చంపేందుకు ప్రయత్నించినా అవి ఫెయిలయ్యాయి. దీంతో పట్టుబడకుండా చంపేయాలని పక్కా ప్లాన్ వేసి తన ప్రియుడి సాయంతో ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేయించింది.

వివాహేతర సంబంధాలే కారణం

రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితులైన లక్ష్మణ్, రమేశ్, సమ్మయ్యను మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో సృజన, ఆమె తండ్రి అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. దీనిప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్ (42) డాక్యుమెంట్ రైటర్. 2010లో శాంతయ్య కుటుంబానికి చెందిన భూముల కొలతల కోసం లక్ష్మణ్ వచ్చాడు. ఆ సమయంలో శాంతయ్య భార్య సృజనతో లక్ష్మణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో లక్ష్మణ్ దగ్గర సృజన రెండు విడుతల్లో రూ.4లక్షలు అప్పుగా తీసుకుంది. అప్పు తీర్చే క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటికే శాంతయ్యకు మాసు పద్మతో ఎఫైర్ ఉంది. దీని విషయంలో శాంతయ్యతో సృజనకు, ఆమె తల్లిదండ్రులు అర్నకొండ అంజయ్య, చంద్రమ్మకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ పంచాయితీ పెద్దది కావడంతో ఆరు నెలల క్రితం శాంతయ్య గుడిపెల్లి వెళ్లి అక్కడ పద్మతో వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాడు.

ఆరు నెలల నుంచే ప్లాన్

ఆరు నెలల కిందట శాంతయ్య ఇల్లు విడిచివెళ్లిన తర్వాత సృజనను, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆస్తులన్నీ పద్మ కుటుంబానికే రాసిస్తాడని, సింగరేణి ఉద్యోగం కూడా తన కొడుకులను కాదని పద్మ కొడుకులకు ఇస్తాడేమో అని సృజన అనుమానం పెంచుకుంది. ఇదే సమయంలో 4 లక్షల బాకీ తీర్చమని లక్ష్మణ్ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో శాంతయ్యను చంపితేనే తన కష్టాలు తీరుతాయని సృజన భావించింది. ఇదే విషయాన్ని లక్ష్మణ్‌కు సృజన, ఆమె తండ్రి అంజయ్య చెప్పారు. తన బిడ్డ పేరు మీద లక్షెట్టిపేటలో ఉన్న 10 గుంటల భూమిలో 3 గుంటలు రాసిస్తామని ఆశ చూపించి శాంతయ్య హత్యకు ఒప్పించింది.

అలాగే శాంతయ్యకు సింగరేణి నుంచి వచ్చే డబ్బుల్లో కూడా కొంత కాజేయొచ్చని లక్ష్మణ్ ప్లాన్ వేసుకున్నాడు. అదే టైమ్‌లో గద్దెరగడిలో ఉన్న భూమిని సృజనకు తెలియకుండా శాంతయ్య అమ్మేశాడు. ఇదే అదునుగా శాంతయ్యపై తన అన్నదమ్ములతో కేసు వేయించాడు లక్ష్మణ్. అలాగే సింగరేణిలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా మెయింటెనెన్స్ కేసు కూడా వేయించాడు. ఇక శాంతయ్య హత్య కోసం లక్షెట్టిపేటకు చెందిన శ్రీరాముల రమేశ్‌తో సృజన, లక్ష్మణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నాలుగు లక్షలకు డీల్ మాట్లాడుకుని.. రూ.40 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. నెలలోనే శాంతయ్య హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

రెండుసార్లు యాక్సిడెంట్‌కు యత్నం

శాంతయ్యను యాక్సిడెంట్ చేసి చంపేయాలని తొలుత ప్లాన్ వేశారు. ఇందుకోసం లక్షెట్టిపేటకు చెందిన కొమాకుల మహేశ్‌కు చెందిన బొలెరోను రూ.1.40 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు.శాంతయ్య కదలికలపై నిఘా పెట్టేందుకు గుడిపెల్లికి చెందిన సమ్మయ్యతో రూ.1.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. సమ్మయ్య ఇచ్చిన సమాచారంతో మంచిర్యాల నుంచి ఆటోలో వస్తున్న శాంతయ్య, పద్మలను గుడిపెల్లి సమీపంలో ఢీకొట్టి చంపాలని అనుకున్నారు. కానీ ఆర్ కే 5 రోడ్డు మలుపు వద్ద బొలెరో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో నాలుగు రోజుల తర్వాత మరోసారి మంచిర్యాలలో బొలెరోతో ఢీకొట్టి చంపాలనుకున్నారు. కానీ అది కూడా ఫెయిల్ అయ్యింది. దీంతో కత్తులతో దాడి చేసి చంపుదామని రామకృష్ణాపూర్ అంగడిలో కత్తులు కూడా కొన్నారు. కానీ ఈజీగా దొరికిపోతామని భావించి ప్లాన్ మార్చారు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ పెట్రోల్ పోసి విలన్లను చంపినట్టుగా శాంతయ్య, పద్మను చంపాలని నిర్ణయించుకున్నారు.

ఆ రోజు ఏం జరిగింది?

గత శుక్రవారం సాయంత్రం 2 గంటల సమయంలో శాంతయ్య, పద్మ, ఆమె భర్త శివయ్యతో గుడిపెల్లిలోనే ఉండటంతో సమ్మయ్య ఈ విషయాన్ని రమేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో రమేశ్, లక్ష్మణ్ కలిసి మంచిర్యాలకు వచ్చి ప్లాస్టిక్ క్యాన్, ఖాళీ రైస్ బ్యాగ్, కారప్పొడి, అగ్గిపెట్టెలు తీసుకున్నారు.అనంతరం యాదగిరి అనే ఆటో డ్రైవర్‌ను ఆటో తీసుకురావాలని సూచించారు. కానీ యాదగిరి అందుబాటులో లేకపోవడంతో శ్రిపతి రాజు అనే మరో డ్రైవర్‌ను పంపించాడు. అతను వచ్చాక ఆటోలో వెళ్లి రమేశ్, లక్ష్మణ్ 5వేల పెట్రోల్ కొన్నారు. అనంతరం ముగ్గురు వెళ్లి మద్యం తాగారు. తర్వాత గుడిపెల్లికి వెళ్లారు.అక్కడ రమేశ్‌ను వదిలేసి లక్ష్మణ్ ఆటోలో తిరిగి మంచిర్యాల వెళ్లిపోయాడు. రాత్రి 12:30 గంటల సమయంలో సమ్మయ్య, రమేశ్ ఇద్దరూ వెళ్లి పెట్రోల్‌ను పద్మ ఇంటిపై చల్లి నిప్పు పెట్టారు.అయితే ముగ్గురిని మాత్రమే చంపాలని అనుకున్నామని.. మౌనిక, ఆమె పిల్లలు ఇంట్లో ఉన్న సంగతి తమకు తెలియదని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. కాగా శాంతయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్న తర్వాత సృజన, లక్ష్మణ్ పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నారు. దొరికిపోవద్దనే ఉద్దేశంతో నాలుగు నెలలుగా ఫోన్ మాట్లాడుకోవడం మానేశారు. ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ కలిసి మాట్లాడుకునే వారు. కానీ అంతకుముందు మాత్రం రెగ్యులర్‌గా కాల్స్ మాట్లాడుకునేవారని పోలీసులు గుర్తించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

DMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News