Home Latest News Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Telangana Budget | సొంతంగా భూమి ఉండి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేవా? తెలంగాణ ప్రభుత్వం మీకోసం ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎవరికి అయితే సొంతంగా జాగా ఉండి ఇల్లు లేకుండా ఉంటారో వాళ్లకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణాల 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.7,890 కోట్లను కేటాయించింది.

ప్రతి నియోజకవర్గానికి 2 వేల మంది చొప్పున ఈ పథకం కింద ఎంపిక చేసి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఈ సాయం అందిస్తామని తెలిపారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 2.63 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇక డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు గానూ డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ.12వేల కోట్లు కేటాయించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం.. భూకంప ధాటికి 640 మందికి పైగా సజీవ సమాధి

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Telangana Budget 2023-24 | 2 లక్షల 90 వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన హరీశ్‌ రావు

Yamini Sharma | ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక గుంజుడే గుంజుడు.. యామినీ శర్మ సంచలన వ్యాఖ్యలు

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

caste certificate for dog | కుక్కకు క్యాస్ట్‌ సర్టిఫికెట్‌.. ఆధార్‌ కార్డు ప్రూఫ్‌గా పెట్టి మరి అప్లై..

Peddagattu Lingamanthula Jathara | ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర.. జనసంద్రమైన గొల్లగట్టు

Exit mobile version